డాక్టర్ అనిల్ కుమార్ జాదవ్‌కు రాష్ట్ర ఉత్తమ వైద్య అవార్డు
సుమన్ టీవీ కార్యక్రమంలో అవార్డు ప్రదానం… అనంతరం భైంసాలో ఘన సన్మానం
వైద్య సేవలను గుర్తిస్తూ, ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన సుమన్ టీవీ కార్యక్రమంలో డాక్టర్ అనిల్ కుమార్ జాదవ్ ను “రాష్ట్ర ఉత్తమ వైద్య అవార్డు” ప్రదానం చేయడం జరిగింది.
ఈ పురస్కారాన్ని అందుకున్న సందర్భంగా, నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని జీ.డి.ఆర్ ఆసుపత్రిలో డాక్టర్ అనిల్ కుమార్ ను గురువారం ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ప్రసంగించిన సామాజిక సేవకుడు, బ్లడ్ డోనర్స్ గ్రూప్ వ్యవస్థాపకుడు సురేష్ మాట్లాడుతూ –> “డాక్టర్ అనిల్ కుమార్ పేద ప్రజలకు అందిస్తున్న సేవలు అభినందనీయం. ఆయన మరెన్నో సేవా కార్యక్రమాలు చేపట్టి, ఇంకా అనేక పురస్కారాలు అందుకోవాలని మనస్పూర్తిగా ఆకాంక్షిస్తున్నాం,” అని అన్నారు.
ఈ సన్మాన కార్యక్రమంలో సురేష్, హరీష్, మనోజ్, నవీన్ తదితరులు పాల్గొని డాక్టర్ ను అభినందించారు.