మెండోరా (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 15
మెండోరా మండలంలోని దూదిగాం గ్రామంలో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఒక కార్యక్రమం నిర్వహించారు. గ్రామ వార్డు సభ్యులు దోమకొండ రమేష్, ఏరుగట్ల యేసు ఆధ్వర్యంలో క్రీడాకారులకు వాలీబాల్ వల, క్రీడా దుస్తులను పంపిణీ చేశారు.

సర్పంచ్ సూచనలు
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ హారూన్ రషీద్, వార్డు సభ్యులు రమేష్, యేసులను క్రీడాకారులు ఘనంగా సన్మానించారు. యువత క్రీడా రంగంలో ముందుండాలని, క్రీడలు శారీరక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని సర్పంచ్ హారూన్ రషీద్ సూచించారు. గ్రామంలోని క్రీడాకారులకు అవసరమైన సహాయ సహకారాలను అందిస్తామని ఆయన తెలిపారు.
పాల్గొన్నవారు
ఈ కార్యక్రమంలో క్రీడాకారులు సాల్మన్ రాజ్, చింటూ, ఫిరోజ్, తేజ, మతీన్, నీలేష్, షాబూ, జ్ఞాని తదితరులు పాల్గొన్నారు.