అనంత పద్మనాభ స్వామి ఆలయంలో ప్రత్యేక దర్శనం
తిరువనంతపురంలో స్వామివారిని దర్శించిన మాజీ జడ్పీటీసీల ఫోరం ప్రధాన కార్యదర్శి మనోహర్ రెడ్డి
తిరువనంతపురం జనవరి 07 ( మనోరంజని తెలుగు టైమ్స్ )
తిరువనంతపురం, బుధవారం :
కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో ఉన్న ప్రసిద్ధ అనంత పద్మనాభ స్వామి ఆలయంలో బుధవారం ప్రత్యేక దర్శనం జరిగింది. ఈ సందర్భంగా మాజీ రాష్ట్ర జడ్పీటీసీల ఫోరం ప్రధాన కార్యదర్శి మనోహర్ రెడ్డి స్వామివారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు, ఆచార కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో కొంతసేపు ధ్యానంలో గడిపారు. ఈ ప్రత్యేక దర్శనం తనకు ఆధ్యాత్మిక శక్తిని, మనోశాంతిని ఇచ్చిందని మనోహర్ రెడ్డి తెలిపారు.