నిమజ్జనోత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలి: ఎస్పీ జానకి షర్మిల

వినాయక నిమజ్జన మార్గ పరిశీలన
  • నిమజ్జనోత్సవాల కోసం ముధోల్ లో జిల్లా ఎస్పీ పరిశీలన
  • శాంతియుతంగా ఉత్సవాలు జరపాలని సూచనలు
  • 200 మంది పోలీసు సిబ్బంది భద్రతా ఏర్పాట్లు

వినాయక నిమజ్జన మార్గ పరిశీలన


ముధోల్ లో వినాయక నిమజ్జన మార్గాన్ని జిల్లా ఎస్పీ జానకి షర్మిల గురువారం పరిశీలించారు. ప్రజలంతా ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని కోరారు. 200 మంది పోలీసు సిబ్బంది భద్రత కోసం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఉత్సవ కమిటీ సభ్యులకు సైతం నిమజ్జనం శాంతియుతంగా జరిపేందుకు సహకరించాలని సూచించారు.

వినాయక నిమజ్జన మార్గ పరిశీలన
ముధోల్, సెప్టెంబర్ 12:
వినాయక నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా జరిపించాలని జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల గురువారం ముధోల్ లో తెలిపారు. నిమజ్జన మార్గాన్ని ఏఎస్పీ అవినాష్ కుమార్ తో కలిసి పరిశీలించిన ఎస్పీ, వినాయక మండపాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవ కమిటీ సభ్యులు ఆమెకు శాలువా అందజేసి సన్మానించారు.

నిమజ్జనోత్సవం సందర్భంగా 200 మంది పోలీసు బలగాలతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. సిబ్బందికి ఉత్సవాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సలహాలు అందించి, నిమజ్జనాన్ని శాంతియుతంగా జరిపేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిఐ జి. మల్లేష్, ఎస్సై సాయికిరణ్, ఉత్సవ కమిటీ అధ్యక్షులు రోళ్ల రమేష్, కార్యదర్శి ధర్మపురి సుదర్శన్, బీజేపీ మండల అధ్యక్షులు కోరి పోతన్న, గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షులు గుంజలోళ్ల నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment