నిర్మల్ జిల్లా పోలీసుల కృషికి సెల్యూట్: ఎస్పీ జానకి షర్మిల

నిర్మల్ జిల్లా పోలీసుల కృషికి సెల్యూట్: ఎస్పీ జానకి షర్మిల
  • వారం రోజుల గణేష్ బందోబస్తులో పోలీసులు నిద్రలేకుండా పనిచేశారు
  • ప్రశాంతంగా గణేష్ నిమజ్జన కార్యక్రమం పూర్తి
  • ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా జిల్లాలో నిమజ్జనం
  • భైంసా, ముదోల్, నిర్మల్, ఖానాపూర్ ప్రాంతాల్లో సజావుగా నిమజ్జనం
  • నిమజ్జన ప్రక్రియలో అధికారులు సమన్వయంతో పనిచేశారు

నిర్మల్ ఎస్పీ గణేష్ నిమజ్జనం

నిర్మల్ జిల్లా పోలీసు సిబ్బంది వారం రోజులుగా గణేష్ బందోబస్తులో కంటిమీద కునుకు లేకుండా పనిచేశారు. ఎస్పీ డా. జానకి షర్మిల ఐపీఎస్, ఈ సిబ్బందికి అభినందనలు తెలిపారు. భైంసా, ముదోల్, నిర్మల్ పట్టణం, ఖానాపూర్ ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా గణేష్ విగ్రహాల నిమజ్జనం ప్రశాంతంగా పూర్తయింది.

నిర్మల్ జిల్లా గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ముగియడంతో జిల్లా ఎస్పీ డా. జానకి షర్మిల ఐపీఎస్ పోలీసు సిబ్బందిని అభినందించారు. వారం రోజులుగా కంటి మీద కునుకు లేకుండా భైంసా, ముదోల్, నిర్మల్ పట్టణం, ఖానాపూర్ ప్రాంతాల్లో గణేష్ బందోబస్తులో పాల్గొన్న పోలీసు సిబ్బందికి తన సెల్యూట్ తెలిపారు.

ఈనెల 7వ తేదీ ప్రారంభమైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు, 12 రోజుల పాటు ప్రశాంతంగా సాగాయి. వివిధ శాఖలతో సమన్వయం చేసుకుంటూ, నిమజ్జన ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయడంలో పోలీసులు కీలక పాత్ర వహించారు. ఎస్పీ మాట్లాడుతూ, “ఖైరతాబాద్ గణపతిని ఆదర్శంగా తీసుకుని, నిమజ్జనాలు ఒకే రోజులో పూర్తయ్యేలా ప్రణాళిక వేయాలని” సూచించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment