జోనల్ క్రీడా పోటీలలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల జామ్ విద్యార్థినుల అత్యుత్తమ ప్రతిభ
లెఫ్ట్ పోచంపాడు లో జరిగిన జోనల్ స్థాయి క్రీడా పోటీలలో జామ్ విద్యార్థినుల విజయం
అథ్లెటిక్స్, కబడ్డీ, క్యారమ్స్, చెస్, సాంస్కృతిక కార్యక్రమాల్లో బహుమతుల వర్షం
ఓవరాల్ ఛాంపియన్‌షిప్ గెలుచుకున్న జామ్ విద్యార్థినులు
మనోరంజని తెలుగు టైమ్స్ సారంగాపూర్ ప్రతినిధి నవంబర్ 10
నిర్మల్ జిల్లా పరిధిలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల జామ్ విద్యార్థినులు తమ ప్రతిభతో అందరిని ఆకట్టుకున్నారు. నవంబర్ 6 నుండి నవంబర్ 8, 2025 వరకు లెఫ్ట్ పోచంపాడు లో జరిగిన జోనల్ స్థాయి క్రీడా పోటీలలో ఈ విద్యార్థినులు విశేష ప్రతిభ చూపారు. విద్యార్థిని జగశ్రీ (VIII B) అండర్-14 విభాగంలో లాంగ్ జంప్‌లో మొదటి బహుమతి, షాట్‌పుట్‌లో రెండో బహుమతి, డిస్కస్ త్రోలో మూడో బహుమతి గెలుచుకుంది. ఇందు (VIII B) డిస్కస్ త్రోలో మొదటి బహుమతి, హై జంప్ మరియు 400 మీటర్ల పరుగులో రెండో బహుమతి గెలుచుకుంది. సాకృతి అండర్-14 విభాగంలో 100 మీటర్ల రన్నింగ్‌లో రెండో బహుమతి సాధించింది. కబడ్డీ అండర్-14 జట్టు రెండవ బహుమతిని దక్కించుకుంది. అండర్-17 క్యారమ్స్‌లో మంజుల మరియు అలేఖ్య జట్టు రెండో బహుమతి గెలుచుకున్నారు. చెస్‌లో సనా (X B) రెండో బహుమతి, అండర్-19 విభాగంలోని సాహిత్య 800 మీటర్ల రన్నింగ్‌లో రెండో బహుమతి సాధించింది.అథ్లెటిక్స్, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ విభాగంలో జామ్ పాఠశాల విద్యార్థినులు ఓవరాల్ ఛాంపియన్‌షిప్ గెలుచుకోవడం విశేషం. క్రీడా పోటీలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా మొదటి బహుమతి దక్కించుకున్నారు. విద్యార్థినులను, వారి తల్లిదండ్రులను, పీఈటీ సుస్మిత, పీడీ సుప్రియ, మ్యూజిక్ టీచర్ స్వప్నలను కళాశాల ప్రిన్సిపల్ బి.సంగీత మరియు పాఠశాల సిబ్బంది అభినందించారు.