కుబీర్ గ్రామంలో ఘనంగా హోలీ సంబరాలు-మిత్రులతో పాల్గొన్న SJWHRC ఉత్తర తెలంగాణ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ సాప పండరి:-
కుబీర్ గ్రామంలో అంగరంగ వైభవంగా హోలీ సంబరాలు జరుపుకున్నారు. సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఉత్తర తెలంగాణ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ సాప పండరి తన పదవ తరగతి మిత్రులతో కలిసి ప్రకృతితో కూడిన రంగులు ఒకరికొకరు పోసుకున్నారు. ఈ కార్యక్రమంలో మిత్రులు అలికే దత్తాత్రి, కొత్తగొళ్ల దత్తాత్రి, సంఘీ రాజశేఖర్, కందుర్ దిగంబర్, కోల్షిక్వార్ సతీష్, బోయిడి రవి, అలికే పోతన్న, మంగలి శ్రీనివాస్,బంక గణేష్, చొండి మధు, బాల మహేష్ పలువురు మిత్రులు ఎంతో సంబరంగా హోలీ పండుగ జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా SJWHRC ఉత్తర తెలంగాణ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ సాప పండరి కుబీర్ మండల మాజీ ఎంపీపీ వడ్నం జ్యోతి నాగేశ్వర్ గార్లకు రంగులు పూసి హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. అదే విధంగా పలువురు బాలురు వారి ఇంటికి వెళ్లి రంగులు వేయగా విద్యార్థులకు న్యాచురల్ రంగులు వాడాలని, కెమికల్స్ తో కూడిన రంగులు వాడి అనారోగ్యాలకు గురికావద్దని విద్యార్థులకు తెలియజేశారు