నిఘా సంస్థల పనితీరును మెరుగు పరచాలి .

నిఘా సంస్థల పనితీరును మెరుగు పరచాలి .

రాజమండ్రి ..

నిఘా సంస్థల పనితీరును మెరుగు పరచాలి .

పోలీస్ శాఖ నుండి “అనిశా” ను వేరు చేయండి..

రాజకీయ ఒత్తిడి లేని పోలీస్ విధులను సంస్కరించండి ..

నేర రహిత సమాజం కై గ్రామ కమిటీలను నియమించండి.

మేడా శ్రీనివాస్ , సూచనలు..
రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్..

నేర పరిశోధన ను సాధారణ పోలీసులు నుండి వేరు చేయాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (అర్పిసి)ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టి వారాంతపు సమావేశంలో అర్పిసి వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు ..

నిఘా వ్యవస్థలు నేర సమాచారాన్ని సేకరించటంలో నైపుణ్యతను కోల్పోతున్నారని , సమాజంలో మత్తు ప్రధార్దాలు , నకిలీ సరుకుల ముఠాల అక్రమాల ప్రమాదాలను గుర్తించటంలో పూర్తిగా వైఫల్యం చెందుతున్నారు . నిఘా విభాగాల్లో పని చేస్తున్న కొంతమంది దిగువ స్థాయి వారికి సరైన అక్షర విజ్ఞానం తో పాటుగా అందుబాటులో ఉన్నటు వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని సైతం ఉపయోగించుకోవటం చేత కావటంలేదు . స్థానిక సమాచారాన్ని లౌక్యంగా స్నేహ బావంతో రాబెట్టుకునే వద్ద కూడా అహం తో విలువైన సమాచారాన్ని సేకరించలేక పోతున్నారు . శాంతి భద్రతలకు అత్యంత ప్రాధాన్యత గలది నిఘా విభాగం అని మరిచిపోతున్నారు. కేవలం జీతం కోసమే పని చేస్తున్నట్టుగా విధులు నిర్వహించడం బాధాకరమని , చేసే పనిలో సోషల్ రెస్పాన్సిబులిటీ కనపడక పోవటం బాధాకారం . పౌరులకు, సమాజానికి ఎంతో బాధ్యతగా రక్షణ కల్పించాల్సిన విభాగాల్లో నిఘా విభాగం అత్యంత కీలకమైనదని వీరు మరువ కూడదు . నిఘా విభాగాల అజగ్రత్త , నిర్లక్ష్యం కారణంగా జరిగే నేరాలు , ఘోరాలు యాదేచ్చగా జరుగుతున్నాయని , అందుకు సంబందించిన రక్షణపై నిఘా విభాగలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించటం అశ్యాస్పందంగా బావించాలి . నిఘా విభాగాల్లో విధులు నిర్వహించే వారు హాజరు పట్టికకు ఇచ్చే ప్రాధాన్యత సామర్ధ్యనికి ఇవ్వకపోవటం దురదృష్టం . నిఘా సంస్థలకు ప్రభుత్వాలు సహకరిస్తే
ఏ ఒక్క నేరం కూడా జరగని విధంగా దమ్ము చూపించే దృదమైన సత్తా మన నిఘా వ్యవస్థల వద్ద వున్నప్పటికి రాజకీయ అవినీతి కాలుష్యంతో నిఘా వ్యవస్థలకు గ్రహణం పట్టిస్తున్నారని ఆయన తీవ్ర ఆవేదన చెందారు ..

అవినీతి లో ఎక్కువగా ఆరోపణలు వెల్లు ఎత్తుతున్న పోలీస్ శాఖనే అవినీతి నిరోధక శాఖ(అనిశా)తో కలిసి విధులు నిర్వహించడం కారణం అవినీతిని నియంత్రించ లేక పోతున్నారని , సత్ఫలితాలు రావటం లేదని , ప్రతి ప్రభుత్వ శాఖ లోను అవినీతి సొమ్ములు ఇవ్వనిదే ఏ ఒక్క పని కాదనేది జగమెరిగిన సత్యం అని , సబ్ రిజిస్ట్రార్, తహసీల్దార్ ల కార్యాలయాల వద్ద లంచం అడిగితే మాకు ఫోన్ చేయండి అంటు అనిశా వారు పెట్టే బోర్థులను చూసే ప్రజలు , ఆ కార్యాలయాలకు వచ్చే వారు ఆ ప్రకటలను చూసి నవ్వుకుంటున్నారు . కొంతమంది అయితే “అనిశా” మూలంగా సామాన్యులకు
ఏ ఒక్క ఉపయోగం లేక పోయిందని , అవినీతికి బాగా అలవాటు పడిన కొంతమంది పోలీస్ లకే అనిశా లో విధులు నిర్వహించడం దొంగే దొంగ దొంగ అన్నట్టుగా వుందని బాహటంగానే విమర్శలు గుప్పిస్తున్నారు . అనిశా వారి కంటికి ఎప్పుడు దిగువ స్థాయి సిబ్బంది మాత్రమే కనపడతారని , అప్పుడప్పుడు మొక్కు బడిగా ట్రాప్ లు వేసి జైలుకు పంపుతారని , అది కూడా ఎక్కువగా ఇతర శాఖలకు సంబందించిన దిగువస్థాయి సిబ్బందినే పట్టుకుంటారనే బలమైన విమర్శలు సైతం అనిశా పై వున్నాయి . అధికారి , ఉన్నత అధికారి అవినీతిని ప్రోత్సహించక పొతే ఏ దిగువస్థాయి సిబ్బంది లంచాలు తీసుకునేటందుకు సాహాసించరని , కొన్ని కొన్ని అనిశా ట్రాప్ లు కోర్టులో కేసులు బలహీన పడే విధంగా ముద్దాయిలకు అనుకూలంగా కేసును నీరుగార్చటం కూడా
ఈ తరహా అధికార దుర్వినియోగ చర్యలకు కారణం అవుతుంటాయి . సాధారణ పోలీస్ గా పనిచేస్తున్న సమయంలో అనిశా కేసులో పట్టుబడి జైలుకు వెళ్లి కాల క్రమంలో తిరిగి అనిశా లోకే బదిలి పై వచ్చి విధులు నిర్వహించటం ఆశ్యాస్పదంగా ఉంటుంది . ప్రభుత్వం పోలీస్,అనిశా లను ఒకే శాఖగా నిర్వాహణ జరుపటం కారణంగా మంచి ఫలితాలు లేకపోగా అవినీతి రోజు రోజుకు పెరిగిపోతుందన్నారు . అనిశా నిర్వహణకు ప్రభుత్వ ధనం ఏటా 100 కోట్లు నిరుపుయోగంగా వృధా అవుతుందనేది యాదార్థ ఘటన . అనిశా లో బాధితుల ఫిర్యాదులు గుట్టలు గుట్టలుగా పేరుకుపోవటం తప్ప బాధితులకు మేలు జరిగిన సంఘటనలు లేకపోతున్నాయి . అనిశా ను పోలీస్ శాఖ కు సంబంధం లేని విధంగా ఒక ప్రత్యేక విభాగన్ని ఏర్పాటు చేస్తేనే అవినీతి నియంత్రణ సాధ్యం అవుతుందని అనేకమంది మేధావులు , శాస్త్రవేత్తల అభిప్రాయాలు , సూచనలు వున్నాయి . అవినీతి నియంత్రణపై ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేకపోయింది . పోలీస్ – అనిశా లను వేరు చేయనంత కాలం అవినీతి పెరగటం తప్ప నియంత్రణ సాధ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు .

నిరంతరం మానసిక ఒత్తిడితో నిండి ఉన్నటువంటి పోలీస్ విధులకు రాజకీయ ఒత్తిడిలు తొడయ్యి పోలీసుల మానసిక పరిస్థితులను అనారోగ్యాలకు , ఆత్మహత్యలకు దారి తీస్తున్నాయని , పోలీస్ లలో దిగువస్థాయి ఉద్యోగిని బానిసగా కాకుండా గౌరవం గాను, ఆప్యాయత తోను పలకరించే విధంగా ఉన్నత అధికారులు తీరు ఉంటేనే పోలీసులు రెట్టించిన ఉత్సాహంతో త్వరిత గతిన నేరాలను చెందించగలరని , పోలీసులకు ఒక ప్రక్క రాజకీయ ఒత్తిడిలు , ఉన్నత అధికారుల వేదిపులు పోలీస్ వారి వ్యక్తిగత జీవితాలకు పెను ప్రమాదాలను కలిగిస్తున్నాయి . పోలీస్ ఉద్యోగం భయంతో చేసేది కాదని , బాధ్యతతోను చేసేదని గుర్తించాలి . రాజకీయ ఒత్తిడిలు , అధికారుల ఆదేశాల అమలుపై దృష్టి పెట్టాలో , శాంతి భద్రతల సమస్యలపై దృష్టి సారించాలో సాధారణ పోలీసులకు అర్ధం కాక ప్రజల్లో వ్యతిరేకతను మూట గట్టుకుంటున్నారు . రాజకీయ పాలకుల సౌలభ్యార్థం ప్రోటోకాల్ పోలీస్ లను ప్రత్యేకంగా నియమించుకోవాలని , ఉన్నత అధికారులు దిగువస్థాయి పోలీస్ లపై ఆప్యాయ్యతను కనపరచి వారి ఆత్మగౌరవానికి తోడ్పాటునివ్వాలని , తద్వారా మెరుగైన శాంతి భద్రతలు , ప్రజల మన్ననలు పోలీస్ లకు దక్కుతాయని , నేరాలు తగ్గుముఖం పట్టే పరిస్థితులు ఏర్పడతాయని , ఈ తరహా సంస్కరణలు పై దృష్టి సారిస్తే అసంతృప్తితో విధులు నిర్వహించే పోలీసులు సైతం నిజాయితీగా విధులు నిర్వహించి కుటుంబాలతో సంతోషకరమైన జీవితాలు గడుపుతారని ఆయన ధీమా వ్యక్త పరిచారు .

ఎప్పటి కప్పుడు నేరాలు తగ్గుముఖం పట్టే విధంగా ప్రభుత్వం , పోలీసులు కొత్త కొత్త వ్యూహలను అన్వేషించాలని , భద్రత వున్న చోటనే వ్యవస్థ భద్రతగా వుంటుందని , రాజకీయ ఒత్తిడిలకు , వేధింపులకు తలోగ్గి ఎంతో గొప్ప గొప్ప ఆశయాలు, లక్ష్యాలు ఉన్నటువంటి పోలీస్ ఉన్నత అధికారులు సైతం నిరుత్సాహంతో మెరుగైన విధులపై దృష్టి సారించలేకపోవటం బాధాకరం . నేరాలు తగ్గుముఖం పట్టాలంటే పోలీసులకు , ప్రజలకు మధ్య సాన్నిహిత్యం ఉండాలి , ఆ సంబంధాలు ప్రేమగాను , ఆప్యాయత గాను వుండే విధంగా పోలీసులు ప్రజలతో ఇమిడిపోవాలి. నేరాలు వేగంగా తగ్గటానికి ప్రత్యేక మార్గాలను అన్వేషించే దిశగా ప్రభుత్వం , పోలీస్ శాఖ అడుగులు వేయాల్సిన గురుతర భాద్యతను అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఆసన్నమైనదిగా ఆలోచించాలి . అందులో భాగంగా గ్రామ కమిటీలను నియమించాలి , పోలీస్ లకు ఎఫ్ ఐ ఆర్ దాఖలు చేయటం వరకు మాత్రమే భాద్యతను అప్పగించి నేర పరిశోధనకు ఒక ప్రత్యేక మైన ఇన్వెస్టిగేషన్ పోలీస్ విభాగాన్ని ఏర్పాటు చేసిన నాడే నేరాలు నియంత్రింపబడతాయి . నేరస్తులకు ఖచ్చితమైన శిక్షలు విధింపబడతాయి . కేవలం జీతాలు కోసమే ఉద్యోగాలు చేస్తేనే చాలు అనుకుంటే వ్యవస్థతో బాటుగా సమాజం , మనం, మన బిడ్డలు సైతం తీవ్రంగా నష్ట పోతామని అర్పిసి అధ్యక్షులు మేడా శ్రీనివాస్ హెచ్చిరించారు ..

సభకు అర్పిసి సీనియర్ సెక్యులర్ పెండ్యాల కామరాజు అధ్యక్షత వహించారు .

ఈ సమావేశంలో అర్పిసి సెక్యూలర్స్ సర్వశ్రీ సిమ్మా దుర్గారావు , లంక దుర్గప్రసాద్ , దుడ్డే త్రినాద్ , వర్ధనపు శరత్ కుమార్ , ఆకుల మణికాంత్ , మోర్త ప్రభాకర్, దుడ్డే త్రినాద్ , వల్లి శ్రీనివాసరావు, దోషి నిషాంత్ , వాడపల్లి జ్యోతిష్ , గుడ్ల సాయి దుర్గా ప్రసాద్ , బసా సోనియా , సుంకర వెంకట భాస్కర రంగారావు, చల్లా సాంబశివరావు, అడపా శేషగిరి , మాసా అప్పాయమ్మ , కుడుపూడి పార్థసారధి , దోషి మోక్ష, దోషి సుజల్ , తదితరులు పాల్గొనియున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment