మహిళల భద్రతకు షీ–టీమ్ విస్తృత పహారా

మహిళల భద్రతకు షీ–టీమ్ విస్తృత పహారా

పార్కులు నుంచి కాలేజీల వరకు ప్రత్యేక నిఘా
“మహిళల రక్షణ మా తొలి ప్రాధాన్యం” — జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, ఐపీఎస్

మనోరంజని తెలుగు టైమ్స్ నిర్మల్, నవంబర్ 14

మహిళల భద్రతకు షీ–టీమ్ విస్తృత పహారా

మహిళలపై నేరాలను అరికట్టడం, మహిళలు అధికంగా వచ్చే ప్రదేశాల్లో భద్రతను బలోపేతం చేయడం లక్ష్యంగా నిర్మల్ షీ–టీమ్ బృందం విస్తృత పహారాలు నిర్వహిస్తోంది. జనసంచారం ఎక్కువగా ఉండే పార్కులు, స్కూళ్లు, కళాశాలలు, దేవాలయాలు, మార్కెట్లు, బస్టాండ్లు, పబ్లిక్ ప్రదేశాల్లో షీ–టీమ్ బృందాలు రోజువారీ పర్యటనలు చేస్తున్నాయి. ప్రజల్లో అవగాహన కల్పించే భాగంగా మహిళల భద్రత, సైబర్ సెక్యూరిటీ, ఈవ్‌టీజింగ్ నివారణ అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.
అకతాయిలను అదుపులో పెట్టేందుకు షీ–టీమ్ ప్రత్యేక దాడులు చేపడుతూ, అనుమానాస్పదంగా తిరిగేవారిని గుర్తించి విచారణ జరుపుతోంది. మైనర్‌లయితే తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్, మేజర్లపై మాత్రం సంబంధిత చట్టాల ప్రకారం పెట్టీ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటోంది.

ఎస్పీ జానకి షర్మిల మాట్లాడుతూ…

“నిర్మల్ జిల్లాలో మహిళల భద్రతకు ప్రాధాన్యం ఇచ్చి పోలీసు శాఖ అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఎక్కడైనా మహిళలపై వేధింపులు గమనించిన వెంటనే డయల్ 100 లేదా షీ–టీమ్ హెల్ప్‌లైన్ 87126 59550 కు సమాచారం ఇవ్వండి” అని పిలుపునిచ్చారు.

Join WhatsApp

Join Now

Leave a Comment