- మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ఠ ముఖర్జీ వ్యాఖ్యలు.
- తండ్రి మరణ సమయంలో సీడబ్ల్యూసీ సమావేశం కూడా జరగలేదని విమర్శ.
- కాంగ్రెస్ తనను తప్పుదోవ పట్టించిందని ఆరోపణ.
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ఠ ముఖర్జీ కాంగ్రెస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తండ్రి మరణ సమయంలో కాంగ్రెస్ సీడబ్ల్యూసీ సమావేశం జరగకపోవడం బాధకరమని, గతంలో కేఆర్ నారాయణన్ మృతి సందర్భంగా సీడబ్ల్యూసీ సంతాపం తెలిపిందని గుర్తుచేశారు. ఈ విషయంలో కాంగ్రెస్ తనను తప్పుదోవ పట్టించిందని ఆమె ఆరోపించారు.
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ఠ ముఖర్జీ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర ఆరోపణలు చేశారు. “నా తండ్రి మరణం సమయంలో కాంగ్రెస్ పార్టీ కనీసం సీడబ్ల్యూసీ (కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ) సమావేశం కూడా నిర్వహించకపోవడం చాలా బాధాకరంగా ఉంది” అని పేర్కొన్నారు.
గతంలో కేఆర్ నారాయణన్ మృతి సమయంలో సీడబ్ల్యూసీ సంతాపం తెలిపినట్టు గుర్తుచేస్తూ, ఆ సంతాప సందేశాన్ని తాను కూడా గుర్తు చేసుకున్నానని తెలిపారు. “అప్పుడు సంతాప సందేశాన్ని నాన్న ప్రణబ్ ముఖర్జీ గారే రచించారు. కానీ నా తండ్రి విషయంలో ఈ ప్రక్రియను కాంగ్రెస్ పాటించలేదు. ఈ విషయాన్ని నేను ప్రశ్నించినప్పుడు, సీడబ్ల్యూసీ సంతాపం తెలపడం ఆనవాయితీ కాదని ఓ నేత నన్ను తప్పుదోవ పట్టించారు” అని శర్మిష్ఠ వ్యాఖ్యానించారు.
ఆమె వ్యాఖ్యలు కాంగ్రెస్ పట్ల మరోసారి విమర్శల తూటాలు ఎక్కించాయి. ప్రణబ్ ముఖర్జీ రాజకీయ జీవితంలో ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నప్పటికీ, చివరికి ఆయనకు తగిన గౌరవం లభించలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.