- తెలంగాణ విమోచన వేడుకల్లో స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలకు నిర్లక్ష్యం.
- సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన కుటుంబసభ్యులు వాపారు.
- కనీస ఆతిథ్యం లేకుండా అవమానకరంగా పంపించారు.
తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలకు సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబసభ్యులు, నిర్వాహకుల నిర్లక్ష్యాన్ని, అవమానాన్ని ఎదుర్కొన్నారు. ఆహ్వానం అందినా, వారి పట్ల కనీస గౌరవం చూపించలేదని కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. మిర్యాలగూడకు చెందిన కనపర్తి ధనలక్ష్మి, సూర్యాపేటకు చెందిన నర్సమ్మలు, పట్లించింది అవమానంగా ఉందని వాపోయారు.
తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలలో పాల్గొనడానికి స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబసభ్యులు సుదూర ప్రాంతాల నుంచి వచ్చారు. అయితే, వారికి కనీస సన్మానం చేయకుండా నిర్వాహకుల నిర్లక్ష్యంతో అవమానం జరిగిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మిర్యాలగూడకు చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు నాగేశ్వర్ రావు భార్య కనపర్తి ధనలక్ష్మి, “ఆహ్వానం అందుకుని ఇక్కడికి వచ్చాం. కానీ ఎవరూ పట్టించుకోలేదు. మమ్ముల్ని పలకరించడానికే ఎవ్వరూ రాలేదు,” అని వాపోయింది. అదే విధంగా సూర్యాపేటకు చెందిన నర్సమ్మ కూడా ఈ పరిస్థితిని అంగీకరించలేకపోయింది. “అవమానం పట్ల బాధగా ఉంది, కనీస గౌరవం లేకుండా పంపించారు” అని పేర్కొంది.
సమరయోధుల సేవలను గౌరవించాల్సిన సమయంలో, ఇటువంటి అనుభవాలు వారిని తీవ్ర నిరాశకు గురి చేశాయి.