- వర్షం వల్ల ఇల్లు కూలిన బాధితుడు సత్తయ్యకు సహాయం.
- షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి సాయం అందజేశారు.
- బాధితునికి నిత్యవసర సరుకులు మరియు 10 వేల నగదు పంపిణీ.
- ప్రభుత్వ సాయం అందిస్తామని ఎమ్మెల్యే హామీ.
: గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా షాద్ నగర్ మండలంలోని వెలిజర్ల గ్రామంలో చింతకొండ పల్లి సత్తయ్య ఇల్లు కూలిపోవడంతో, షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి బాధితునికి 10 వేల రూపాయల నగదు మరియు నిత్యవసర సరుకులు అందజేశారు. ప్రభుత్వ సహాయం అందుతుందని ఎమ్మెల్యే శంకర్ అన్నారు.
రంగారెడ్డి జిల్లా: గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వెలిజర్ల గ్రామానికి చెందిన చింతకొండ పల్లి సత్తయ్య ఇల్లు పాక్షికంగా కూలిపోయింది. ఈ ఘటనను తెలుసుకున్న షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మరియు మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి, స్థానిక నేతలతో కలిసి బాధితుని ఇల్లు పరిశీలించారు.
ఈ సందర్భంగా, ఇల్లు కూలిన బాధితునికి సత్వర సహాయంగా 10 వేల రూపాయల నగదు మరియు నిత్యవసర సరుకులు అందజేశారు. ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ, ప్రభుత్వం నష్టపోయిన ప్రజలను ఆదుకోవడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉంటుందని, ఈ సందర్భంలో సత్వర సహాయం అందించాలని ప్రభుత్వ అధికారులను ఆదేశించామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఉపసర్పంచ్ డిప్యూటీ రాజు, మరియు ఇతర స్థానిక నాయకులు పాల్గొన్నారు.