సేవా గుణమే మానవత్వానికి ప్రతీక
మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ సేవాభావానికి ప్రశంసలు
జమ్ములమడుగు, జనవరి 12 (మనోరంజని తెలుగు టైమ్స్):
సేవా గుణమే మానవత్వానికి ప్రతీకగా నిలుస్తుందని జమ్ములమడుగులో మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ మరోసారి నిరూపించింది.
జమ్ములమడుగు గూడెంచెరువు ప్రాంతానికి చెందిన బండారు వెంకట నారాయణ (వృద్ధుడు) అనారోగ్యంతో మృతి చెందగా, అంతిమ సంస్కరణలు నిర్వహించేందుకు బంధువులు ఎవరు ముందుకు రాకపోయారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు ఫోన్ ద్వారా మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ టౌన్ ప్రెసిడెంట్ అహమ్మద్ హుస్సేన్‌ను సంప్రదించగా, ఆయన వెంటనే స్పందించారు.
సోమవారం హిందూ స్మశానవాటికలో హిందూ సంప్రదాయం ప్రకారం అంతిమ సంస్కరణలను ఫౌండేషన్ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మానవతా విలువలను చాటిన ఫౌండేషన్ సేవలను స్థానికులు అభినందించారు.
ఈ సేవా కార్యక్రమానికి సహకరించిన మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ చైర్మన్ మోరే లక్ష్మణ్ రావు, టౌన్ ప్రెసిడెంట్ అహమ్మద్ హుస్సేన్, సభ్యులు సుబహన్, వైస్ ప్రెసిడెంట్ మునీంద్ర, కృప ఆగ్ని షారోన్ ట్రస్ట్ సభ్యులు ప్రసన్న కుమార్, సుమన్ బాబు తదితరులకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.
అలాగే శ్రీ అమ్మ శరణాలయంలోని వృద్ధులకు సహాయం చేయదలచిన దాతలు ఎవరైనా ఉంటే క్రింది నంబర్లను సంప్రదించాలని ఫౌండేషన్ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు.
సంప్రదింపు నంబర్లు:
📞 82972 53484
📞 91822 44150