నకిలీ పాస్ పుస్తకాలపై సీతక్క సీరియస్

M4 న్యూస్ (ప్రతినిధి), తెలంగాణ: అక్టోబర్ 22

 

  • నకిలీ పాస్ పుస్తకాలతో రైతులను మోసం చేసిన కేటుగాళ్లపై మంత్రి సీతక్క ఆగ్రహం
  • కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ
  • అమాయక రైతులను రక్షించడమే లక్ష్యం

 రైతులను మోసం చేస్తూ నకిలీ పాస్ పుస్తకాలు సృష్టించిన కేటుగాళ్లపై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

: తెలంగాణలో నకిలీ పాస్ పుస్తకాలతో రైతులను మోసం చేసి భూములను కబ్జా చేసే కేటుగాళ్లపై మంత్రి సీతక్క తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు. అమాయక రైతుల పేరిట ఫోర్జరీ సంతకాలు చేసి నకిలీ పాస్ పుస్తకాలు సృష్టించిన వ్యక్తులను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె జిల్లా కలెక్టర్, ఫారెస్ట్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

సీతక్క మాట్లాడుతూ, “రైతులను మోసం చేసే వ్యక్తులను వదిలిపెట్టేది లేదు. అమాయక రైతులు ఇలాంటివి ఎదుర్కొనే పరిస్థితులు ఇకపై రాకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలి,” అని స్పష్టంగా చెప్పారు. ఇలాంటి చర్యల ద్వారా ప్రభుత్వాన్ని, బ్యాంకులను మోసం చేస్తున్న వారి పై సమగ్ర విచారణ జరపాలని ఆమె సూచించారు.

Leave a Comment