- ముధోల్ మండలంలో శాస్త్రవేత్తలు వరి పంట పరిశీలన
- వరిలో బాక్టీరియా ఎండకు తెగులు గుర్తింపు
- కాపర్ హైడ్రాక్సైడ్, స్ట్రెప్సోమైసిన్ సల్ఫేట్ తో చికిత్స సూచన
ముధోల్ : సెప్టెంబర్ 19
నిర్మల్ జిల్లా ముధోల్ మండలంలో, ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త ఈ. నరసయ్య, శాస్త్రవేత్తలు డాక్టర్ విజయకుమార్, డాక్టర్ కార్తిక్ వరి పంట క్షేత్ర సందర్శనలో భాగంగా బాక్టీరియా ఎండకు తెగులు గుర్తించారు. రైతులకు ఈ తెగులను నివారించడానికి కాపర్ హైడ్రాక్సైడ్ 400 గ్రా మరియు స్ట్రెప్సోమైసిన్ సల్ఫేట్ 60 గ్రా పిచికారి చేయ్యాలని సూచించారు.
నిర్మల్ జిల్లా ముధోల్ మండలంలో ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త ఈ. నరసయ్య, శాస్త్రవేత్తలు డాక్టర్ విజయకుమార్, డాక్టర్ కార్తిక్ వరి పంట క్షేత్ర సందర్శన చేశారు. వారు ఈ సందర్శనలో బాక్టీరియా ఎండకు తెగులను గుర్తించారు. ఆకల మీద పసుపు రంగు మచ్చలు ఏర్పడి, మచ్చలుగా మొదలై అంచుల వెంబడి అలల మాదిరిగా పై నుండి క్రమేపి మట్టల వరకు వ్యాపిస్తాయని వివరించారు. ఈ తెగుల వల్ల పంట నాశనం కాని విధంగా రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు.
తెగుల వ్యాప్తి నివారించడానికి కాపర్ హైడ్రాక్సైడ్ 400 గ్రా మరియు స్ట్రెప్సోమైసిన్ సల్ఫేట్ 60 గ్రా కలిపి ఒక ఎకరానికి పిచికారి చేయ్యాలని సూచించారు. ఈ సలహాలతో రైతులు తగిన విధంగా చర్యలు తీసుకుంటే పంటలను రక్షించుకోవచ్చు అని శాస్త్రవేత్తలు తెలిపారు.