స్వర్ణ గ్రామంలో సర్పంచ్ ఏకగ్రీవం
మనోరంజని తెలుగు టైమ్స్ – సారంగాపూర్, డిసెంబర్ 6
సారంగాపూర్ మండలం స్వర్ణ గ్రామపంచాయతీ సర్పంచ్ పదవికి బీసీ జనరల్ రిజర్వేషన్ కేటాయించడంతో గ్రామస్తులు ఏకగ్రీవంగా కొత్తింటి మల్లేశ్ ను ఎన్నుకున్నారు. దశాబ్దానికి పైగా రాజకీయ అనుభవం కలిగిన మల్లేశ్ కుటుంబానికి గ్రామంలో ప్రజాదరణ ఉంది. గతంలో ఆయన తల్లి సర్పంచ్‌గా బాధ్యతలు నిర్వర్తించిన విషయం తెలిసిందే. గ్రామాభివృద్ధికే ప్రాధాన్యతనిస్తానని, గ్రామస్తులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఎలాంటి రాజీ ఉండదని మల్లేశ్ తెలిపారు. గ్రామ అభివృద్ధి పనుల్లో తన పూర్తిస్థాయి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.