మహావీర్ తాండలో సర్పంచ్ ఏకగ్రీవం

మహావీర్ తాండలో సర్పంచ్ ఏకగ్రీవం

ఎస్టీ మహిళ రిజర్వేషన్‌తో సామరస్యంగా ఎన్నిక ముగింపు

మనోరంజని తెలుగు టైమ్స్, సారంగాపూర్: నవంబర్ 28
మహావీర్ తాండలో సర్పంచ్ ఏకగ్రీవం

రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల సందడి కొనసాగుతున్న నేపథ్యంలో నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం మహావీర్ తాండలో సర్పంచ్ పదవి ఏకగ్రీవంగా నిలిచింది. గ్రామంలో మొత్తం 500 మంది ఓటర్లు ఉండగా, ఈసారి ఎస్టీ మహిళ రిజర్వేషన్ వర్తించడంతో గ్రామ పెద్దలు శుక్రవారం సమావేశమై సామరస్యంగా నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలో ప్రతిపక్షం లేకుండానే ఆడే పంచి బాయి దిలీప్‌ను ఏకగ్రీవంగా సర్పంచ్‌గా ఎంపిక చేశారు. గ్రామాభివృద్ధికి కట్టుబడి పనిచేస్తానని దిలీప్ గ్రామ ప్రజలకు హామీ ఇచ్చారు.

Join WhatsApp

Join Now

Leave a Comment