లక్ష మంది ఫెడరల్ ఉద్యోగుల రాజీనామా
వాషింగ్టన్:
ట్రంప్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘డిఫర్డ్ రిజిగ్నేషన్ ప్రోగ్రాం’ కింద, లక్షమందికి పైగా ఫెడరల్ ఉద్యోగులు మంగళవారం నుంచి విధులకు దూరమయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం.
ఈ పథకం మొత్తం 2,75,000 మంది ఉద్యోగులపై ప్రభావం చూపనుంది. ఇందులో సుమారు 2 లక్షలమంది ఉద్యోగులు ఏ పనీ చేయకుండానే ఎనిమిది నెలలపాటు పూర్తి జీతం పొందుతారు.
దీనికి సుమారు 14.8 బిలియన్ డాలర్లు ఖర్చవుతున్నప్పటికీ, దీర్ఘకాలంలో ఏటా 28 బిలియన్ డాలర్ల ఆదా అవుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
అయితే ఈ కార్యక్రమాన్ని కార్మిక సంఘాలు కోర్టులో సవాలు చేశాయి.