ఈవీఎం ఎన్నికలను భహిష్కరించాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పిలుపు

  1. ఈవీఎంలపై అన్ని పార్టీలు ఒకే వేదికపైకి రావాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ఆధ్వర్యంలో పిలుపు.
  2. కార్పొరేట్ రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్నాయని ఆరోపణలు.
  3. వైఎస్‌ఆర్ మరణం కూడా ఈవీఎం కుట్రలో భాగమేనని షాక్‌ వ్యాఖ్యలు.

: రాజమండ్రిలో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (ఆర్పీసీ) సమావేశంలో ఈవీఎం ఆధారిత ఎన్నికలను భహిష్కరించాలని పార్టీ అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఈవీఎంలను కార్పొరేట్ పార్టీలు మాత్రమే లాభపడి తమ అనుకూల పార్టీలు గెలిచే విధంగా ఉపయోగిస్తున్నారని, ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తున్నారని ఆరోపించారు. ఏపీ ఎన్నికలలో ఈవీఎం కుంభకోణాలు కీలక పాత్ర పోషించాయని, ప్రజాస్వామ్యం రక్షణకు బ్యాలెట్ సిస్టం తిరిగి రావాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.

: రాజమండ్రి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (ఆర్పీసీ) పార్టీ వారాంతపు సమావేశంలో ఆర్పీసీ వ్యవస్థాపక అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ మాట్లాడుతూ, ఈవీఎం ఆధారిత ఎన్నికలు ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తున్నాయని తీవ్ర విమర్శలు చేశారు. భారతదేశంలో అన్ని రాజకీయ పార్టీలు ఈవీఎంలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. కార్పొరేట్ రాజకీయ వ్యాపార పార్టీలు ఈవీఎంలను తమ అనుకూలం చేసుకుని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు.

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ మరణం కూడా ఈవీఎం కుట్రలో భాగమేనని షాక్‌ వ్యక్తం చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో 2024 ఎన్నికల్లో ఈవీఎంల ఆధారిత మోసాలు జరిగాయనీ, ఎన్నికల సంఘం ఈ కుట్రలకు మద్దత్తు ఇచ్చిందని ఆరోపించారు.

ఈ కార్యక్రమంలో ఆర్పీసీ సీనియర్ నాయకులు మరియు ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Comment