- రాణి కుముదిని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నియమం
- ప్రస్తుత ఎన్నికల కమిషనర్ పార్థసారథి పదవీ విరమణ
- గవర్నర్ బిష్ణు దేవ్ శర్మ నియమానికి ఆదేశాలు జారీ
సెప్టెంబర్ 17, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని రాణి కుముదిని నియమించారు. ప్రస్తుత కమిషనర్ పార్థసారథి ఈ నెల 8వ తేదీ న పదవీ విరమణతో ఆమె స్థానంలో నియమించారు. గవర్నర్ బిష్ణు దేవ్ శర్మ మూడేళ్ల పాటు రాణి కుముదిని ఎస్ఈసీగా కొనసాగించాలని ఆదేశాలు జారీ చేశారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 17: తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని రాణి కుముదిని ఈరోజు నియమించారు. ప్రస్తుత ఎన్నికల కమిషనర్ పార్థసారథి ఈ నెల 8వ తేదీ న తన పదవీ కాలం ముగిసిన తర్వాత, ఆయన స్థానంలో రాణి కుముదిని నియమించారు. గవర్నర్ బిష్ణు దేవ్ శర్మ ఈ నియామకానికి సంబంధించి ఆదేశాలు జారీచేశారు. మూడేళ్ల పాటు ఆమె తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా కొనసాగనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
1988 బ్యాచ్‌కు చెందిన రాణి కుముదిని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. కేంద్ర సర్వీసుల అనంతరం, తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహించారు. 2023 ఎన్నికలకు ముందు ఆమె పదవీ విరమణ చేశారు. అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ఆమెను తిరిగి అదే హోదాలో కొనసాగించింది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యం లో నూతన ఎన్నికల కమిషనర్‌ను నియమించడం ప్రాధాన్యత సంతరించు కుంది.