నిర్మల్ జిల్లాలో ప్రజాపాలన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహణ

నిర్మల్ ప్రజాపాలన దినోత్సవ వేడుక
  1. త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన సిరిసిల్ల రాజయ్య
  2. జిల్లా యంత్రాంగం విస్తృత స్థాయి ఏర్పాట్లు
  3. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకర్షణ
  4. ప్రభుత్వ సంక్షేమ పథకాల వివరాలు

నిర్మల్ ప్రజాపాలన దినోత్సవ వేడుక

నిర్మల్ జిల్లాలో ప్రజాపాలన దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథి సిరిసిల్ల రాజయ్య త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి, ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకర్షణగా నిలిచాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.

నిర్మల్ ప్రజాపాలన దినోత్సవ వేడుక

సెప్టెంబర్ 17న నిర్మల్ జిల్లాలో ప్రజాపాలన దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ ఛైర్మన్ సిరిసిల్ల రాజయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.

ఈ సందర్భంగా ప్రజలకు ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, సెప్టెంబర్ 17 ప్రాముఖ్యతను వివరించారు. తెలంగాణ ప్రాంతం రాచరిక పాలన నుంచి విముక్తి కోసం జరిగిన పోరాటాలను గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పలు సంక్షేమ పథకాలను, అభయహస్తం ఆరు గ్యారెంటీల ద్వారా ప్రజలకు లభించిన లబ్ధిని వివరించారు.

కార్యక్రమంలో విద్యార్థులు తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించే సాంస్కృతిక ప్రదర్శనలు చేసి, అందరినీ ఆకట్టుకున్నారు. విద్యార్థులకు ముఖ్య అతిథులు, జిల్లా కలెక్టర్ ల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.

జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకి షర్మిల, అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్ లతో కలిసి చైర్మన్ రాజయ్య అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు. అనంతరం విద్యాశాఖ ఆధ్వర్యంలో బాలశక్తి కార్యక్రమ పోస్టర్లను ఆవిష్కరించారు. వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, కళాకారులు, ప్రజలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment