- పిఆర్టియు టీఎస్ సర్వ సభ్య సమావేశం బాసరలో ఘనంగా జరిగింది.
- నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికై, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం తీర్మానాలు చేశారు.
- ఉత్తమ ఉపాధ్యాయులు మరియు పదోన్నతులు పొందిన ఉపాధ్యాయులకు సన్మానం.
: నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పిఆర్టియు టీఎస్ సర్వ సభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. ముఖ్యఅతిథిగా బీ. వీ. రమణారావు పాల్గొని, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేందుకు సంఘం కృషి చేస్తుందని తెలిపారు. ఉత్తమ ఉపాధ్యాయులు మరియు పదోన్నతులు పొందిన వారికి సన్మానం చేశారు.
: నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం పిఆర్టియు – టీఎస్ సర్వ సభ్య సమావేశం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న నిర్మల్ జిల్లా పిఆర్టియు- టీఎస్ ప్రధాన కార్యదర్శి బీ. వీ. రమణారావు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయుల సమస్యలను వేగంగా పరిష్కరించే ఏకైక సంఘం పిఆర్టియు-టీఎస్ అని చెప్పారు. పెండింగ్‌లో ఉన్న అన్ని సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిష్కరించేందుకు సంఘం కృషి చేస్తుందని వెల్లడించారు.
సంఘం తాజా కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. బాసర మండల పిఆర్టియు-టీఎస్ సంఘ నూతన అధ్యక్షుడిగా రవీంద్రపూర్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మమ్మాయి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా డి. రమేష్, మహిళా ఉపాధ్యక్షురాలుగా వై. లావణ్య, అసోసియేట్ అధ్యక్షులుగా కౌసర్ అహ్మద్, కార్యదర్శిగా బిల్లోల శ్రీధర్ గౌడ్ ఎన్నికయ్యారు.
ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి తీర్మానాలు చేసి, ఇటీవల ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన టీచర్లను, పదోన్నతి పొందిన ఉపాధ్యాయులను పిఆర్టియు టీఎస్ తరుపున సన్మానించారు. ఈ కార్యక్రమంలో బాసర మండల పిఆర్టియు టీఎస్ తాజా మాజీ అధ్యక్షుడు కొక్కుల గంగాధర్, తాజా మాజీ ప్రధాన కార్యదర్శి రవీందర్ రెడ్డి, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు అన్నెల మల్లారెడ్డి, ముధోల్ మండల పిఆర్టియు టీఎస్ అధ్యక్షుడు ప్రవీణ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి అబ్దుల్ అహద్, మండల విద్యాధికారి జి. మైసాజి, మండల నోడల్ అధికారి నర్సారెడ్డి, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు సాతెల నర్సయ్య, బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు తేజశ్రీ, బి. నారాయణ రెడ్డి, సురేందర్, బలగం శ్రీనివాస్, జి. దేవిదాస్, యోగేశ్వర్ రావు దేశ్ముఖ్, వినయ తదితరులు పాల్గొన్నారు.