: నిర్మల్లో ప్రధాని జన్మదిన వేడుకలు

Alt Name: నిర్మల్ బిజెపి నేత మహేశ్వర్ రెడ్డి ప్రధాని జన్మదిన వేడుక
  1. ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ
  2. ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి స్వయంగా రక్తదానం
  3. ప్రధాని మోడీ పథకాలు ఇంటింటికి తీసుకెళ్లడం కార్యకర్తల కర్తవ్యం

Alt Name: నిర్మల్ బిజెపి నేత మహేశ్వర్ రెడ్డి ప్రధాని జన్మదిన వేడుక

నిర్మల్ పట్టణంలో బిజెపి నేత మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ చేసి, స్వయంగా రక్తదానం చేశారు. కార్యక్రమంలో ఆయన ప్రధాని మోడీ పథకాలు పేదలకు ఎంతో ఉపయోగకరమని, కార్యకర్తలు ఈ పథకాలను ఇంటింటికి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

 సెప్టెంబర్ 17, నిర్మల్ పట్టణంలో బిజెపి నేత మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ చేశారు. స్వయంగా తన ఇంటివద్ద రక్తదాన శిబిరం నిర్వహించి రక్తదానం చేశారు. అనంతరం మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, నరేంద్ర మోడీ చేసిన పనులు దేశంలో విశేషంగా ఉన్నాయి, ముఖ్యంగా పేదలు, నిరుపేదల కోసం అనేక పథకాలు అమలు చేశారని అన్నారు. ప్రధానమంత్రి పథకాలను ప్రతి కార్యకర్త ఇంటింటికి తీసుకెళ్లడం కర్తవ్యం అని పేర్కొన్నారు. కార్యక్రమంలో కార్యకర్తలతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment