ముధోల్, 2026-09-02
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా ముధోల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నివాళులర్పించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి, వైఎస్సార్ హయాంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను నాయకులు గుర్తు చేసుకున్నారు.
వైఎస్సార్ సేవలు చిరస్మరణీయం
17వ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు
ముధోల్, సెప్టెంబరు 2 మనోరంజని తెలుగు టైమ్స్ :మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా ముధోల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే భోంస్లే నారాయణ్రావు పటేల్ ఆధ్వర్యంలో బుధవారం పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వైఎస్సార్ హయాంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను నాయకులు గుర్తు చేసుకున్నారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ప్రజల సంక్షేమం, గ్రామీణాభివృద్ధికి విశేష ప్రాధాన్యం ఇచ్చారని పేర్కొన్నారు. ఆయన ప్రజలకు అందించిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నర్సారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శంకర్ చంద్ర, పీఏసీఎస్ మాజీ చైర్మన్ శ్యామ్రావు పటేల్, పురంశెట్టి రవికుమార్, మక్సూద్తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.












