ఇచ్చోడా (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 18
తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీలో కీలక నియామకాలు జరిగాయి. నియోజకవర్గ ఇన్చార్జ్గా నియమితులైన రాథోడ్ బాపూరావుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు. ఇచ్చోడా మండల కన్వీనర్‌గా షేక్ బిలాల్, సామాజిక మాధ్యమాల విభాగం బాధ్యతలు షేక్ కలీమ్లకు అప్పగించారు.
తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీ తరఫున నియోజకవర్గ ఇన్చార్జ్గా నియమితులైన రాథోడ్ బాపూరావుకు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఇచ్చోడా మండల కన్వీనర్‌గా షేక్ బిలాల్‌కు బాధ్యతలు అప్పగించి, మండల స్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న రాథోడ్ బాపూరావుకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.
అలాగే, ఇచ్చోడా మండల సామాజిక మాధ్యమాల విభాగం బాధ్యతలను షేక్ కలీమ్‌కు అప్పగించినందుకు రాథోడ్ బాపూరావుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, తెలంగాణ హక్కుల సాధన కోసం నిబద్ధతతో పనిచేస్తానని ఈ సందర్భంగా షేక్ కలీమ్ పేర్కొన్నారు.
రాథోడ్ బాపూరావు నాయకత్వంలో తెలంగాణ రక్షణ సేన పార్టీ మరింత బలోపేతమై ప్రజలకు చేరువ కావాలని ఆకాంక్షిస్తూ పార్టీ శ్రేణులు ఆయనకు మరోసారి శుభాకాంక్షలు తెలిపారు.












