ఢిల్లీ, తెలంగాణ (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 03
తెలంగాణ రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలపై ఢిల్లీలో కీలక చర్చలు జరిగాయి. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇతర ముఖ్య నేతలు సమావేశమయ్యారు. పార్టీ బలోపేతం, క్రమశిక్షణ వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.
ఢిల్లీ వేదికగా కాంగ్రెస్ కీలక భేటీ ఖర్గేతో డాక్టర్ ఎస్.ఏ. సంపత్‌కుమార్ సమావేశం.. తెలంగాణ రాజకీయాలపై సుదీర్ఘ చర్చలు న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలపై ఢిల్లీలో కీలక చర్చలు జరిగినట్లు సమాచారం. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శి, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్.ఏ. సంపత్‌కుమార్, నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి, మంత్రి శ్రీధర్‌బాబు, రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్ యాదవ్ తదితరులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలు, పార్టీ అంతర్గతంగా జరుగుతున్న చర్చలపై ఖర్గేతో నేతలు సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. పార్టీ క్రమశిక్షణపై చర్చ పార్టీ క్రమశిక్షణను కాపాడటం, అధిష్ఠానం నిర్ణయాలకు అనుగుణంగా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ముందుకు సాగడం వంటి అంశాలు సమావేశంలో ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. అవసరమైన క్రమశిక్షణాపరమైన చర్యలపైనా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. మంత్రి వర్గ విస్తరణ.. ఎమ్మెల్సీ ఎన్నికలపై దృష్టి తెలంగాణలో మంత్రి వర్గ విస్తరణ, రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలు, పార్టీకి సంబంధించిన కీలక పదవుల భర్తీ, వర్కింగ్ ప్రెసిడెంట్ పదవుల అంశాలపైనా అగ్ర నాయకత్వం వద్ద చర్చ జరిగినట్లు సమాచారం. పార్టీ బలోపేతమే లక్ష్యం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడం, ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం, పార్టీ శ్రేణుల మధ్య సమన్వయాన్ని పెంచడం వంటి అంశాలపై కూడా నేతలు అధిష్ఠానంతో చర్చించినట్లు సమాచారం. అయితే సమావేశంలో చర్చించిన అంశాలపై అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది.

