💦* (మనోరంజని తెలుగు టైమ్స్) జూన్ 27
💦 SIR (Special Intensive Revision) పేరుతో ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలపై అనవసర భయాలు వద్దని అధికారులు సూచిస్తున్నారు. "అందరూ డాక్యుమెంట్లు ఇవ్వాలి", "ఓటు తొలగిస్తారు" వంటి సందేశాలపై స్పందిస్తూ, అసలు ప్రక్రియ ఎలా ఉంటుందో వివరించారు.
💦 SIR (Special Intensive Revision) పేరుతో జరుగుతున్న ప్రచారాలపై అనవసర భయాలు వద్దని అధికారులు సూచిస్తున్నారు. "అందరూ డాక్యుమెంట్లు ఇవ్వాలి", "ఓటు తొలగిస్తారు", "ఇంటింటికీ వచ్చి ఇబ్బంది పెడతారు" వంటి సందేశాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో, అసలు ప్రక్రియ ఎలా ఉంటుందో తెలుసుకుంటే చాలా అపోహలు తొలగిపోతాయని నిపుణులు చెబుతున్నారు.
Booth Level Officer (BLO) మీ ఇంటికి వచ్చి ఎన్యూమరేషన్/వెరిఫికేషన్ ఫారం ఇస్తారు. ఇప్పటికే మీరు ఓటరుగా నమోదు అయి ఉంటే, ఎన్నికల సంఘం (EC) వద్ద మీ ప్రాథమిక వివరాలు ఉంటాయి. మీ పేరు, EPIC నంబర్, కుటుంబ వివరాలు వంటి సమాచారం ప్రింట్ చేసి ఉంటుంది. మొత్తం ఫారం మళ్లీ నింపాల్సిన అవసరం ఉండదు.
ఫారంలో ఉన్న వివరాలు ఒకసారి పరిశీలించండి. పేరు, పుట్టిన తేదీ (DOB), చిరునామా, కుటుంబ వివరాలు సరైనవో కాదో చూసుకోవాలి. అన్నీ సరిగ్గా ఉంటే మిగిలిన అవసరమైన సమాచారం మాత్రమే నింపి సంతకం చేస్తే సరిపోతుంది. కొన్నిసార్లు BLO అక్కడే వేచి ఉండి ఫారం తీసుకుంటారు లేదా "ఒక వారం రోజుల్లో వచ్చి తీసుకెళ్తాం" అని చెప్పి వెళ్లవచ్చు. ఒకవేళ డాక్యుమెంట్లు అవసరమైతే ఏవి ఇవ్వాలో కూడా BLO స్పష్టంగా చెబుతారు.
❌ కాదు. ప్రతి ఒక్కరూ డాక్యుమెంట్లు సమర్పించాల్సిన అవసరం లేదు. ఇప్పటికే నమోదైన వివరాలు సరిగ్గా ఉండి, ఎలాంటి మార్పులు లేకపోతే చాలామందికి అదనపు పత్రాలు అడిగే అవసరం ఉండకపోవచ్చు.
పేరు సరిచేయాలంటే, పుట్టిన తేదీ మార్చాలంటే, చిరునామా మారితే, ఇతర వివరాల్లో సవరణ అవసరమైతే, PRE-SIR మాపింగ్ లో తేడాల్లో మీరు ఉంటే.. ఆ మార్పును నిర్ధారించే ఆధార పత్రాలు మాత్రమే ఇవ్వాలి.
BLOలకు ఎన్నికల సంఘం ప్రత్యేక శిక్షణ ఇచ్చింది. వారి వద్ద అవసరమైన మార్గదర్శకాలు, అంగీకరించే పత్రాల జాబితా ఉంటుంది. ఏదైనా సందేహం వచ్చినా వారు పై అధికారులను సంప్రదించి, ఏ పత్రాలు అవసరమో మీకు తెలియజేస్తారు. ప్రతి వ్యక్తి పరిస్థితిని బట్టి ప్రక్రియ మారవచ్చు.
BLO వచ్చినప్పుడు ఇంట్లో లేకపోతే ఓటు తొలగిస్తారా? సమాధానం — ❌ కాదు. సాధారణంగా BLO మరోసారి వస్తారు, కుటుంబ సభ్యులకు సమాచారం ఇస్తారు, మొబైల్ నంబర్ ఉంటే ఫోన్ చేస్తారు, తర్వాత ఎప్పుడు అందుబాటులో ఉంటారో తెలుసుకుని మళ్లీ వస్తారు. ప్రతి BLO ఫోన్ నెంబర్ లు, హెప్ డెస్క్ నెంబర్ లు ఇవన్నీ వున్నాయి. అవసరమైతే మీరు కూడా BLOని సంప్రదించి ఫారం తీసుకోవచ్చు.
✅ అవును. మీ పోలింగ్ బూత్‌కు సంబంధించిన BLO లేదా ERO కార్యాలయానికి వెళ్లి కూడా ఫారం తీసుకోవచ్చు. ఒక్కసారి ఇంట్లో లేకపోయారని మాత్రమే ఓటు వెంటనే తొలగించబడదు. కానీ ఎన్నికల సంఘం ఇచ్చిన గడువులోపు ప్రక్రియ పూర్తి చేయడం మాత్రం మీ బాధ్యత.











