మనోరంజని తెలుగు టైమ్స్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 19
బాన్సువాడ నియోజకవర్గంలో పోచారం భాస్కర్ రెడ్డి ప్రజల మన్ననలు పొందుతున్నారు. తండ్రి, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి బాటలోనే నడుస్తూ, నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నారని, ప్రజల కష్టసుఖాల్లో అండగా ఉంటున్నారని ప్రజలు కొనియాడుతున్నారు. ఆయన తదుపరి ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరిస్తారని ప్రజలు గట్టిగా విశ్వసిస్తున్నారు.
తండ్రికి తగ్గ తనయుడిగా పోచారం భాస్కర్ రెడ్డి బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నారు. నియోజకవర్గ ప్రజల కోసం 24 గంటలు శ్రమిస్తూ, వారి కష్టా, నష్టాల్లో తోడుగా ఉంటున్నారని ప్రజలు అంటున్నారు. జనం గుండెల్లో, నాలుకల యందు పోచారం భాస్కర్ రెడ్డి ఉండటం గర్వకారణమని ప్రజలు కొనియాడుతున్నారు. మాటలతో కాకుండా చేతలతో పనులు చేయిస్తూ, జనానికి అండగా ఉంటామని, జనమే మా దేవుళ్లని ఆయన ముందుకు వెళ్తున్నారని ప్రజలు చెబుతున్నారు.
బాన్సువాడ నియోజకవర్గ ప్రజలకు పోచారం భాస్కర్ రెడ్డిపై ఒక నమ్మకం ఏర్పడింది. ఆయన వద్దకు వెళ్తే క్షణాల్లో పని పూర్తవుతుందని, సమస్యలు తీరిపోతాయని, ఎలాంటి కష్టం వచ్చినా ఆయనను సంప్రదిస్తే తక్షణమే పరిష్కారం లభిస్తుందని ప్రజలు విశ్వసిస్తున్నారు. అందుకే ఆయన నియోజకవర్గంలో ఒక స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారని కొనియాడుతున్నారు.
సుమారు 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అనేక పదవులు చేపట్టి బాన్సువాడ ప్రజల గుండెల్లో నిలిచిపోయారని, ఆయన బాటలోనే పోచారం భాస్కర్ రెడ్డి సైతం నడవడం గర్వకారణమని ప్రజలు భావిస్తున్నారు. తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ, ఆయన ఆశయ సాధన కోసం కృషి చేస్తున్న భాస్కర్ రెడ్డి ప్రజలకు అండగా ఉండటం గొప్ప విషయమని కొనియాడుతున్నారు.
బాన్సువాడ నియోజకవర్గానికి కాబోయే ఎమ్మెల్యే పోచారం భాస్కర్ రెడ్డి అని ప్రజలు అప్పుడే నిర్ణయించుకోవడం ఆయన కృషికి నిదర్శనమని, ప్రజల కోసం పరితపిస్తున్న ఆయన శ్రమ ఫలితమే ఇదని చెబుతున్నారు.
తదుపరి ఎమ్మెల్యే పోచారం భాస్కర్ రెడ్డి అని ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఆయనను ఎమ్మెల్యేగా గెలిపించి తీరుతామని బాన్సువాడ ప్రజలు గర్వంగా చెబుతున్నారు. ఆయన ఎమ్మెల్యే కావాలని దేవుళ్లను ప్రార్థిస్తూ, ఆశీర్వాదాలు కూడా అందిస్తున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది.
ఎన్ని విమర్శలు ఎదురైనా వాటిని పువ్వుల్లా, అక్షింతల్లా స్వీకరించి చిరునవ్వుతో ముందుకు సాగుతున్నారని, ఇగో, కక్ష సాధింపులు పక్కనపెట్టి తండ్రి ఆశయ సాధన కోసం ఆయన చూపిన బాటలోనే నడుస్తున్నారని ప్రజలు అంటున్నారు. రెచ్చగొట్టే విమర్శలు, వ్యక్తిగత విమర్శలు ఎదురైనా, తండ్రిపై విమర్శలు వచ్చినప్పుడు కూడా కోపాన్ని దిగమింగుకొని, అసూయ, క్రోధం లేకుండా ప్రజల కోసం పనిచేస్తూ వారి వందనాలు అందుకుంటున్నారని ప్రజలు కొనియాడుతున్నారు.
తదుపరి ఎమ్మెల్యేగా పోచారం భాస్కర్ రెడ్డి ప్రజలకు మరింత సేవలు అందించాలని, ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు.












