Lakshadweep, 5 September
తనపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, దీనిని కార్యకర్తలు ఎవరూ విశ్వసించవద్దని షాద్నగర్ భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. తనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రారావుకు అందె బాబయ్య ఫిర్యాదు చేసినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని ఆయన తెలిపారు.
*నాపై ఓర్వజాలక తప్పుడు ప్రచారం* *బిజెపి నేత పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి వివరణ* *రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రారావు దీనిని కొట్టిపారేశారు* *రాజకీయంగా ఎదుర్కోలేక అధికార పార్టీ కుయుక్తులు* నా రాజకీయ ఎదుగుదల భారతీయ జనతా పార్టీ వీరోచిత పోరాటాలను చూసి ఓర్వజాలక తనపై తప్పుడు ప్రచారం కొందరు చేస్తున్నారని దీనిని కార్యకర్తలు ఎవరు విశ్వసించకూడదని షాద్ నగర్ భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. మీడియా మిత్రులకు అభివందనాలు నిన్న మీడియాలో ఒక సమాచారం తనపై తప్పుగా వచ్చిందని పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి ఓ కీలక సమాచారాన్ని విడుదల చేశారు. తనపై భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రారావు కు అందె బాబయ్య ఫిర్యాదు చేసినట్లు వచ్చిన సమాచారాల్లో వాస్తవం లేదని రామచంద్రరావుకు తనపై ఫిర్యాదు చేసినట్లు ఎవరు కలవలేదని ఆయన తనకు స్పష్టత ఇచ్చినట్లు విష్ణువర్ధన్ రెడ్డి చెప్పడం గమనార్హం. గత కొంతకాలంగా భారతీయ జనతా పార్టీ నియోజకవర్గంలో చేస్తున్న వీరోచిత పోరాటాలను చూసి తట్టుకోలేక అధికార పార్టీ నాయకులకు కొందరు ఇలాంటి పిచ్చి ప్రచారాలు చేయిస్తున్నారని మీడియాకు తప్పుడు సమాచారాలు అందిస్తున్నారని విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. సిద్దాపూర్ డంపింగ్ యార్డ్ వ్యవహారంలో ఓవైపు పార్టీ నాయకులు అందే బాబయ్య, నెల్లి శ్రీ వర్ధన్ రెడ్డిలు ఢిల్లీలో సైతం వీరుచిత పోరాటం చేశారని గుర్తు చేశారు. అదేవిధంగా డంపింగ్ యార్డ్ వ్యవహారాన్ని తాను కూడా తప్పుపడుతూ పెద్ద ఎత్తున ఉద్యమించాలని తెలిపారు. అలాగే పాలిటెక్నిక్ విలీన ఆందోళన కార్యక్రమంలో కూడా పాలుపంచుకోవడం జరిగిందని అనేక ప్రజా వ్యతిరేక ఉద్యమాలలో తాను ఉద్యమిస్తున్న సందర్భాలను గుర్తు చేశారు. భారతీయ జనతా పార్టీ చేస్తున్న పోరాటాలు చూసి సహించలేక ఓర్వలేక తనపై తప్పుడు రాజకీయ ప్రకటనలు గుప్పిస్తున్నారని పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తనపై ఫిర్యాదు వచ్చిన అంశాన్ని రాష్ట్ర అధినేత రామచంద్రరావుకు అడిగి తెలుసుకోవడం జరిగిందని ఆయనను నిన్న రాత్రి ప్రత్యేకంగా కలుసుకోవడం జరిగిందన్నారు. అయితే తనపై ఇలాంటి ఫిర్యాదు రాలేదని పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డికి రాష్ట్ర అధ్యక్షుడు తెలియజేసినట్లు తెలిపారు. *అది తప్పుడు సమాచారం..* అందె బాబయ్య పేరిట విడుదలైన ప్రకటన ఫేక్ న్యూస్ అని పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి బిజెపి పార్టీ తరఫున కొట్టి పారేశారు. రాష్ట్ర అధ్యక్షుడు సైతం అలాంటి ఫిర్యాదు ఏది తన పొందలేదని చెప్పారని ఆయన పేర్కొన్నారు. క్రమశిక్షణ గల భారతీయ జనతా పార్టీలో ఏ నాయకుడు ఏ కార్యకర్త అంతర్గతంగా కుటుంబ పరంగా ఉన్న విషయాలను బయట మీడియాకు ఇవ్వరని తెలిపారు. సిద్ధపూర్ డంపింగ్ యార్డ్, 22ఎ, పాలిటెక్నిక్ విలీనం తదితర స్థానిక అంశాలపై తమ పార్టీ విరోచితంగా పోడుతుందని ఇలాంటి క్రమంలో ఇతర పార్టీల నాయకులు తనపై నిందారోపణలు చేస్తున్నారని స్పష్టత ఇచ్చారు. అబద్ధపు ప్రచారాలను మీడియా ద్వారా చేస్తున్నారని చెప్పారు. ప్రజల్లో పార్టీ కార్యకర్తల్లో అపోహలు సూచించడానికి ఇదంతా చేస్తున్నారని దీనివల్ల బిజెపి పోరాటాలకు ఎలాంటి డోకా ఉండాలని మరింత ముందుకు వెళ్తానని చెప్పారు. ఏ భారతీయ జనతా పార్టీ కార్యకర్త పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించి మీడియాకు సమాచారం ఇవ్వరని అని చెప్పారు.. *










