నిర్మల్, 5 September
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తయిన సందర్భంగా జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో ఈ ర్యాలీ జరిగింది.
వెయ్యి రోజుల ప్రజాపాలన విజయోత్సవం సందర్భంగా లో కాంగ్రెస్ భారీ బైక్ ర్యాలీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ఉద్దేశంతో జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. వెయ్యి రోజుల ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఈ ర్యాలీకి కాంగ్రెస్ శ్రేణులు, యువకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కూచాడి శ్రీహరి రావు, ముధోల్ నియోజకవర్గ ఇన్చార్జి నారాయణ పటేల్ , మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూచాడి శ్రీహరి రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ప్రజా సంక్షేమం, రైతులు, మహిళలు, యువత, పేదల అభ్యున్నతికి అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. వెయ్యి రోజుల ప్రజాపాలనలో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలు, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో చేపట్టిన కార్యక్రమాలను ప్రజలు బేరీజు వేసుకోవాలని శ్రీహరి రావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తూ ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. 2028 ఎన్నికల్లో మరోసారి కాంగ్రెస్‌దే అధికారం” – కూచాడి శ్రీహరి రావు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బైక్‌లతో ర్యాలీలో పాల్గొని ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు. పట్టణంలో ర్యాలీ ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగింది.










