ఇచ్చోడ మండలానికి చెందిన ముక్ర(కే) గ్రామ సర్పంచ్ గైక్వాడ్ జైపాల్, పలువురు గ్రామస్తులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఈ చేరికలు జరుగుతున్నాయని బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆడే గజేందర్ పేర్కొన్నారు.
నేరడిగొండ మండలంలోని క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో, ఆడే గజేందర్ పార్టీ కండువా కప్పి గైక్వాడ్ జైపాల్ తో పాటు కాకడే గజానంద్, కాసాని విష్ణు, తిరుపతి, అశోక్, సచిన్, ఆకాష్, సంతోష్, దీపక్, రవికాంత్, శ్రీధర్, పరశురాం, గంగాధర్, మధుకర్, సాయినాథ్, ప్రకాష్, నానేశ్వర్, నారాయణ, అనిల్ కుమార్, దినేష్, గోపాల్, సునీల్, మారుతి, ప్రభాకర్ వంటి పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమం కోసం నిబద్ధతతో పనిచేస్తోందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలు విశ్వాసం చూపుతున్నారని సర్పంచ్ గైక్వాడ్ జైపాల్ తెలిపారు. బోథ్ నియోజకవర్గంలో ఆడే గజేందర్ నాయకత్వంలో పార్టీ బలోపేతం అవుతోందని, గ్రామ స్థాయిలో పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.
ఆడే గజేందర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల జీవితాల్లో సానుకూల మార్పులు తెస్తున్నాయని, దీనికి ఆకర్షితులై వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు, యువ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని తెలిపారు. పార్టీ ఎల్లప్పుడూ ప్రజల అభ్యున్నతికి కట్టుబడి పనిచేస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఇచ్చోడ మండల అధ్యక్షుడు కళ్ళెం నారాయణ రెడ్డి, బోథ్ మార్కెట్ డైరెక్టర్ శ్రీరామోజీ నారాయణ, నియోజకవర్గ మైనారిటీ చైర్మన్ ముస్తఫా, యండి సద్దాం, మురళి గౌడ్, నారాయణ తదితరులు పాల్గొన్నారు.












