మిర్యాలగూడ, 2026-08-05
మున్సిపల్ పరిధిలో చేపట్టిన తాగునీటి పనులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి పూర్తి చేయాలని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. అలాగే గ్రామ పంచాయతీగా ఉన్న సమయంలో కమాటీలను, జవాన్లను తీసుకోవడం జరిగిందని, ప్రస్తుతం వారిలో కొంతమందికి వయస్సు మళ్ళినందున కమాటిల ఏర్పాట్లపై చర్య తీసుకోవాలని ఆయన జిల్లా కలెక్టర్‌ను కోరారు.

పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి
పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో హాస్పిటల్, బస్టాండ్, కూరగాయల మార్కెట్, వైకుంఠధామం, తదితర ప్రదేశాల వద్ద ప్రజలకు ఇబ్బంది కలగకుండా పారిశుద్ధ్యాన్ని పకడ్బందీగా నిర్వహించాలన్నారు. శానిటేషన్ పైనే ప్రజల ఆరోగ్యం ఆధారపడి ఉందని, ఇందుకు ప్రజాప్రతినిధులుగా తాము కూడా పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు.
అధికారుల అందుబాటు, నిత్యావసరాలపై దృష్టి
అధికారులు మున్సిపల్ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని, ప్రతి రోజు తాగునీరు, విద్యుత్ పై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. మున్సిపల్ పరిధిలోని ఎన్ఎస్పి క్యాంపు, చింతపల్లి, ఆడవిదేవులపల్లిలో స్థలాలు ఉన్నందున సబ్ స్టేషన్ల మంజూరుకు సహకరించాలని జిల్లా కలెక్టర్‌తో కోరారు. అలాగే విద్యుత్తు సమస్య లేకుండా విద్యుత్ స్తంభాలు వైర్ల కోటా మిర్యాలగూడ కు రావడంలేదని, ఈ విషయంపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు.
ఆదాయ మార్గాల పెంపు, రహదారి భద్రత
మున్సిపల్ ఆదాయ మార్గాన్ని పెంచేలా మున్సిపాలిటీ ప్రజాప్రతినిధులు, ప్రత్యేకించి మున్సిపల్ కౌన్సిలర్లు అధికారులకు సహకరించాలని చెప్పారు. మిర్యాలగూడ మున్సిపల్ పరిధిలోని విస్తరించి ఉన్న జాతీయ రహదారిపై నాలుగు చోట్ల ప్రమాదాలు జరిగేందుకు అవకాశం ఉందని, అక్కడ ప్రమాదాలు జరగకుండా వై జంక్షన్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు.
వ్యాపారాల ఆక్రమణలపై చర్యలు
పట్టణం మొత్తం రహదారులపై తోపుడు బండ్లు, చిరు వ్యాపారాలు చేసుకునేవారు స్థలాలను ఆక్రమించడం వల్ల ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయని, ఈ విషయంపై దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌తో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కోరారు.