గోపాల్రావుపేట (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 17
చొప్పదండి నియోజకవర్గం రామడుగు మండలం గోపాల్ రావు పేట్ లోని శుభం గార్డెన్స్ లో రామడుగు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతనంగా ఎన్నికైన పాలకవర్గ ఆశీర్వాద సభకు ముఖ్య అతిథిగా హాజరైన చొప్పదండి శాసన సభ్యులు, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మేడిపల్లి సత్యం నూతన పాలకవర్గాన్ని సన్మానించారు.

కార్యకర్తలకు అండగా కాంగ్రెస్
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ ప్రతీ కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటానని హామీ ఇచ్చారు. నూతనంగా ఏర్పాటైన పాలకవర్గం రైతుల పట్ల నిబద్ధతతో పనిచేస్తూ వారిలో విశ్వాసం కలిగించేలా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని సూచించారు.
రైతు సంక్షేమానికి ప్రాధాన్యత
ప్రస్తుత కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు. సింగిల్ విండో ద్వారా రైతులకు అందే ఎరువులు, విత్తనాలు, మరియు పంట ఋణాల పంపిణీని మరింత సులభతరం చేయడంపై నూతన కమిటీ ప్రత్యేకంగా దృష్టి సారించాలని కోరారు. ఈ సొసైటీ దేశానికే ఆదర్శంగా ఉండేలా తీర్చిదిద్దాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
పాల్గొన్న ప్రముఖులు
ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ కోల రమేష్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు మాజీ ఎంపిపి జవ్వాజి హరీష్, మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మర వేణి తిరుమల తిరుపతి, గోపాల్రావుపేట సర్పంచ్ ఎడవల్లి వనజ నరేందర్, చొప్పదండి సింగిల్ విండో ఛైర్మన్ ఇప్ప శ్రీనివాస్ రెడ్డి, జిల్లా నాయకులు, రైతులు, ప్రజాప్రతినిధులు, 6 మండలాల కాంగ్రెస్ కుటుంబ సభ్యులు, పలు గ్రామాల సర్పంచులు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, సింగిల్ విండో చైర్మన్లు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.