ఖానాపూర్, 2026-08-19
పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి ప్రజా సంక్షేమ పథకాలను అత్యంత పారదర్శకంగా అమలు చేస్తున్నామని నిర్మల్ జిల్లా డీసీసీ ఎస్సి సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాసమల్ల అశోక్ స్పష్టం చేశారు. మండల అధ్యక్షుడు సంఘర్తి రాజన్నతో కలిసి ఆయన ఈ పథకాల అమలు తీరుపై వస్తున్న ఆరోపణలను ఖండించారు.
పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి ప్రజా సంక్షేమ పథకాలను అత్యంత పారదర్శకంగా అమలు చేస్తున్నామని నిర్మల్ జిల్లా డీసీసీ ఎస్సి సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాసమల్ల అశోక్ స్పష్టం చేశారు. మండల అధ్యక్షుడు సంఘర్తి రాజన్నతో కలిసి ఆయన ఈ పథకాల అమలు తీరుపై వస్తున్న ఆరోపణలను ఖండించారు.
రాజ్యాంగబద్ధమైన అధికార పరిధి
రాజ్యాంగంలోని ఆర్టికల్ 162 కింద రాష్ట్ర ప్రభుత్వానికి సంక్రమించిన కార్యనిర్వాహక అధికారాల పరిధిలోనే ఈ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని రాసమల్ల అశోక్ తెలిపారు. సంక్షేమ అంశాలపై ప్రభుత్వ ఉత్తర్వులు (జీవోలు) జారీ చేసి పథకాలను అమలు చేసే పూర్తి రాజ్యాంగబద్ధమైన అధికారం ప్రభుత్వానికి ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ విషయానికి సంబంధించి సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన రాయ్ సాహిబ్ రామ్ జవాయ కపూర్ వర్సెస్ పంజాబ్ రాష్ట్రం తీర్పు స్పష్టమైన న్యాయ ఆధారమని గుర్తుచేశారు.
డెలిగేటెడ్ లెజిస్లేషన్గా పరిగణించాల్సిన అవసరం లేదు
కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ఎగ్జిక్యూటివ్ వెల్ఫేర్ స్కీమ్స్ మాత్రమేనని, వీటిని డెలిగేటెడ్ లెజిస్లేషన్గా పరిగణించాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వం శాసనసభకు సంబంధించిన ఎసెన్షియల్ లెజిస్లేటివ్ ఫంక్షన్‌ను తన చేతుల్లోకి తీసుకుందనే ఆరోపణలు పూర్తిగా అవగాహనారాహిత్యంతో కూడుకున్నవని కొట్టిపారేశారు.
ఆర్థిక నియంత్రణపై ఆరోపణలు వాస్తవం కాదు
ప్రజాధనాన్ని ఎలాంటి నియంత్రణ లేకుండా ఖర్చు చేస్తున్నారనే ఆరోపణలు వాస్తవాలకు విరుద్ధమని రాసమల్ల అశోక్ మండిపడ్డారు. ఈ పథకాలకు కేటాయించే నిధులకు రాష్ట్ర బడ్జెట్ ద్వారా శాసనసభ ఆమోదం ఉంటుందని తెలిపారు. ట్రెజరీ రూల్స్, ఫైనాన్షియల్ కోడ్‌తో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న ఇతర ఆర్థిక నిబంధనలకు కట్టుబడే నిధులు విడుదలవుతాయని స్పష్టం చేశారు. ప్రతి దశలోనూ ప్రభుత్వ ఆర్థిక నియంత్రణలు, విధివిధానాలు పాటిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
అర్హత పరిశీలన తర్వాతే లబ్ధిదారులకు సాయం
కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల లబ్ధిదారుల ఎంపికలో కఠినమైన వెరిఫికేషన్ విధానం అమలులో ఉందని ఆయన తెలిపారు. అర్హత, ఆదాయ పరిమితి, వయస్సు, ఆధార్ కార్డు, వివాహ ధృవీకరణ తదితర అంశాల ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నామని వివరించారు. ముఖ్యంగా వివాహ సమయానికి వధువుకు 18 సంవత్సరాలు పూర్తి కావడం తప్పనిసరి అని తెలిపారు. ఆర్డీఓ, తహశీల్దార్ స్థాయి అధికారుల పర్యవేక్షణలో క్షేత్రస్థాయి పరిశీలన, ధృవీకరణ పూర్తయిన తర్వాతే అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ సహాయం అందుతుందని స్పష్టం చేశారు.












