మనోరంజని తెలుగు టైమ్స్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 19
రాష్ట్రంలో స్థానిక ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్న నేపథ్యంలో, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పార్టీ నేతలకు కీలక దిశా నిర్దేశం చేశారు. ఈ నెల 22న పార్టీ ముఖ్య నేతలతో ఆయన కీలక సమావేశం ఏర్పాటు చేశారు.
రాష్ట్రంలో స్థానిక ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. సెప్టెంబర్ చివరి వారంలో మున్సిపల్, ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పార్టీ నేతలకు కీలక దిశా నిర్దేశం చేశారు. వార్డు నుంచి మండలం వరకు ఏ ఎన్నిక అయినా పార్టీ అభ్యర్థే పోటీ చేయాలని స్పష్టం చేశారు.
పార్టీ అభ్యర్థి పోటీలో లేకపోతే నియోజకవర్గ ఇంఛార్జ్‌లను బాధ్యులను చేస్తూ కఠిన నిర్ణయాలు తీసుకుంటామని హెచ్చరించారు.
పార్టీ కోసం పనిచేసిన వారికి స్థానికంగా సీట్ల కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
ఈ ఎన్నికలపై పార్టీ ముఖ్య నేతలతో జగన్ ఈ నెల 22న కీలక సమావేశం ఏర్పాటు చేశారు.












