మెదక్ జిల్లా, ఆందోల్ నియోజకవర్గంలోని టేక్మాల్ మండల కేంద్రంలో మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు 54వ జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా కేక్ కట్ చేసి హరీశ్‌రావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ అభివృద్ధికి ఆయన చేసిన సేవలను నాయకులు కొనియాడారు.
ప్రజా సమస్యల పరిష్కారంలో హరీశ్‌రావు ఎల్లప్పుడూ ముందుంటారని, ఆయనకు ఆయురారోగ్యాలు, విజయాలు కలగాలని ఆకాంక్షించారు. ఈ వేడుకలు మండల కేంద్రంలో పండుగ వాతావరణాన్ని సృష్టించాయి.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు భక్తుల వీరప్ప, సిద్దయ్య, నాయి కోటి భాస్కర్, సాయిబాబా, రమేష్ నాయక్ చౌహన్, రవి, సలావుద్దీన్, శ్రీనివాస్, మహేందర్, వసంతరావు, ప్రసాద్, నాయి కోటి బాలు, బాలకృష్ణ, సాయిలు, మల్లేశం, నరేష్, రాజేష్, సంగయ్య, నాయి కోటి శ్రావణ్, దాసు, ఏసేపుతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.











