మిర్యాలగూడ, జూలై 22
విద్యార్థుల సమస్యలపై గళమెత్తిన కాంగ్రెస్ అగ్ర నాయకులను అరెస్ట్ చేసిన కేంద్ర ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలను మానుకోవాలని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తులక్ష్మారెడ్డి అన్నారు. ఈ నేపథ్యంలో, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల అక్రమ అరెస్టులకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది.
ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే హక్కు ఉందని, అందులో భాగంగానే విద్యార్థుల సమస్యలపై గళమెత్తిన కాంగ్రెస్ అగ్ర నాయకులను అరెస్ట్ చేసిన కేంద్ర ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలను మానుకోవాలని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తులక్ష్మారెడ్డి (బిఎల్ఆర్) అన్నారు.
బుధవారం కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల అక్రమ అరెస్టు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి రాజీవ్ చౌక్ వరకు విద్యార్థులు, పార్టీ శ్రేణులు భారీ ఎత్తున నిరసన ర్యాలీ చేపట్టారు. ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దహనం చేసి, కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తుందని, ప్రతిపక్షాల గొంతును అణచివేసే ప్రయత్నంలో భాగంగా అక్రమ అరెస్టులకు పూనుకోవటం శోచనీయమని, ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి గొడ్డలిపెట్టు అన్నారు. రాజకీయ కక్ష సాధింపు చర్యలను కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోదని, కాంగ్రెస్ నాయకులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ఆధ్వర్యంలో ప్రచారంలో ఉన్న కార్యక్రమాలు మరింత ఉదృతం చేస్తామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు స్కైలాబ్ నాయక్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తలకొప్పుల సైదులు, పోదిల శ్రీనివాస్, మండల పార్టీ అధ్యక్షులు కాకునూరు బసవయ్య గౌడ్, నాయకులు దేశిరెడ్డి శేఖర్ రెడ్డి, చిలుకూరి బాలకృష్ణ, జావిద్, సలీం, మోయిజ్, అయుబ్, అబ్దుల్లా, రాష్ట్ర యువజన నాయకులు అజారుద్దీన్, ఇమ్రాన్, నాగు నాయక్, పాతూరి శరత్, బీసీ సంఘం రాష్ట్ర నాయకులు పగిడి జీడయ్య యాదవ్, పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, పార్టీ వివిధ అనుబంధ సంఘాల బాధ్యులు, నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.











