*సీఐటీయూ (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 06
రానున్న అసెంబ్లీ సమావేశాల్లో కార్మికుల సమస్యలపై చర్చ జరిపి, వాటి పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి బొమ్మెన సురేష్ డిమాండ్ చేశారు. స్కీం వర్కర్లు, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, డైలీ వేజ్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై సమగ్రంగా చర్చించి పరిష్కారం చూపాలని ఆయన కోరారు.
*కార్మికుల కనీస వేతనం పెంపులో, ఉద్యోగ భద్రత నిర్వహించే అసెంబ్లీలో ప్రభుత్వం దృష్టి పెట్టాలి* – *సీఐటీయూ జిల్లా కార్యదర్శి బొమ్మెన సురేష్* నిర్మల్ జిల్లా మనో రంజని తెలుగు టైమ్స్ రానున్న అసెంబ్లీ సమావేశాల్లో కార్మికుల సమస్యలపై చర్చ జరిపి, వాటి పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలని *సీఐటీయూ జిల్లా కార్యదర్శి బొమ్మెన సురేష్* డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో జరుగుతున్న సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (సీఐటీయూ) తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ కమిటీ సమావేశాలకు జిల్లా ప్రతినిధిగా హాజరై ఆయన మాట్లాడారు. స్కీం వర్కర్లు, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, డైలీ వేజ్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై అసెంబ్లీ సమావేశాల్లో సమగ్రంగా చర్చించి పరిష్కారం చూపాలని కోరారు. కార్మికులకు కనీస వేతనం రూ.26,000గా నిర్ణయించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికల్లో కార్మికులకు ఇచ్చిన హామీలను, మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలను అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ పూర్తిస్థాయిలో అమలు చేయడం లేదని విమర్శించారు. స్కీం వర్కర్లు, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కనీస వేతనం రూ.26 వేలుగా నిర్ణయించాలని కోరారు. కార్మికులందరికీ పీఎఫ్, ఈఎస్ఐ, పెన్షన్, ఇన్సూరెన్స్, ఉద్యోగ భద్రత, రిటైర్మెంట్ బెనిఫిట్స్ వంటి చట్టబద్ధ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న చలో హైదరాబాద్ కార్యక్రమాలకు నిర్మల్ జిల్లాలోని స్కీం వర్కర్లు, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. బీడీ కార్మికులకు జీవన భృతి చేయూత పథకం అవకాశం కల్పించాలి 2016 నుంచి 4016 పెంచి పెన్షన్ అమలు చేయాలి తెలంగాణ రాష్ట్ర పోతే ఎన్నికల హామీని అమలు చేసి కార్మికులకు న్యాయం చేయాలి. ప్రభుత్వ ఉద్యోగులకు CPS విధానని రద్దు చేసి OPS విధానం అమలు చేయాలి, పెండింగ్ లో ఉన్న 6 DAలను వెంటనే విడుదల చేయాలి, ప్రభుత్వ, కార్మిక ఉద్యోగులు న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి రాష్ట్ర వర్కింగ్ కమిటీ సమావేశాల్లో నిర్మల్ జిల్లా కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలను కూడా ప్రస్తావించినట్లు తెలిపారు. ఈ సమావేశాల్లో *సీఐటీయూ జిల్లా అధ్యక్షులు పి. గంగామణి* పాల్గొన్నారు.










