ప్రపంచంలో మూడవ ఆర్థిక శక్తిగా భారతదేశాన్ని నిలపడంలో భారతీయ జనతా పార్టీ కీలక పాత్ర పోషించిందని బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. సోమవారం భారతీయ జనతా పార్టీ 47వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, దేశంలో అనేక విప్లవాత్మక, ఆర్థిక సంస్కరణలు తీసుకువచ్చి భారతదేశాన్ని ప్రపంచంలో మూడో ఆర్థిక శక్తిగా నిలబెట్టిన ఘనత భారతీయ జనతా పార్టీకే దక్కుతుందని తెలిపారు. పార్టీ కేవలం రెండు స్థానాలతో ప్రారంభమై, నేడు వరుసగా మూడు సార్లు కేంద్రంలో అధికారంలోకి రావడంలో కార్యకర్తల కృషి ఎంతో ఉందని ఆయన కొనియాడారు.
రాబోయే ఎన్నికల్లోనూ అధికారంలోకి వచ్చే దిశగా కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని ఆయన సూచించారు. గ్రామాలు, పట్టణాల వరకు పార్టీని మరింత బలోపేతం చేయడానికి కృషి చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్ రెడ్డి, సీనియర్ నాయకులు రావుల రాంనాథ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వి. సత్యనారాయణ గౌడ్, పట్టణ అధ్యక్షులు సుంకరి సాయి, పట్టణ బీజేపీ కౌన్సిలర్లు, జిల్లా, పట్టణ బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.












