మనోరంజని తెలుగు టైమ్స్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 22
అవినీతికి పాల్పడ్డ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేయడం నేరమా అని కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ కన్వీనర్ పి. రఘు నాయక్ ప్రశ్నించారు. ప్రశ్నించిన వారిని చితకబాదడం, మహిళలని కూడా చూడకుండా పోలీసులు చేయి చేసుకోవడం కేంద్ర ప్రభుత్వ ఫాసిస్టు విధానాలకు సిగ్గుచేటని ఆయన విమర్శించారు.
బిజెపి కేంద్ర ప్రభుత్వాన్ని కూల్చమని ఎవరు చెప్పట్లేదు. అవినీతికి పాల్పడ్డ మంత్రి రాజీనామా చేయాలని ప్రశ్నిస్తున్నాం. ప్రశ్నించడం పాపమా? ప్రశ్నిస్తే చితకబాదుతారా? మహిళలని చూడకుండా పోలీసులు ప్రవర్తించిన తీరు భారత దేశంలో కేంద్ర ప్రభుత్వ ఫాసిస్టు విధానాలకు సిగ్గుచేటని కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ కన్వీనర్ పి. రఘు నాయక్ ప్రశ్నించారు.
బిజెపి కేంద్ర ప్రభుత్వ హయాంలో 2021 నుండి నేటి వరకు 89 సార్లు పేపర్ లీకేజీల వ్యవహారం వెలుగు చూసిందని, వివిధ పరీక్షలకు సంబంధించి విద్య శాఖ వివరించిన తీరు సిగ్గుచేటని రఘునాయక్ తెలిపారు. అదేవిధంగా 93 మంది గతంలో విద్యార్థులు దీని కారణంగా ఆత్మహత్యలకు పాల్పడ్డారని, 2025-26 సంవత్సరం నాటికి నీట్ పేపర్ లీక్ వల్ల 26 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
48 పర్యాయాలు రిటర్న్ పరీక్షలు జరిగాయి అంటే కేంద్ర ప్రభుత్వం ఎంత బాధ్యతారహితంగా వ్యవహరిస్తుందో వేరేగా చెప్పనక్కర్లేదు. కేంద్రమంత్రి ధర్మేంద్ర రాజీనామా చేయాలన్న ఒకే ఒక్క డిమాండ్‌తో ఈరోజు భారత విద్యార్థులు, యువతీ యువకులు, ప్రతిపక్ష కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తుంటే పోలీసులను పెట్టి దౌర్జన్యం చేయడం, పోలీసుల ముసుగులో బిజెపి, ఆర్ఎస్ఎస్, బజరంగ్దళ్ నాయకులు మహిళలపై, విద్యార్థులపై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
దేశ చరిత్రలోనే ఈ నిరసన ఒక కేంద్రానికి చెంపపెట్టు. పార్లమెంటులో ఈ అంశం లేవనెత్తకుండా సభను వాయిదా వేయడం సిగ్గుచేటు. నిరసన శాంతియుతంగా జరుగుతున్న ముక్కు పచ్చలారని విద్యార్థులపై ఇలాంటి ఛార్జి చేయడం సిగ్గుచేటు. మహిళలపై మగ పోలీసులు ప్రవర్తించిన తీరు గర్హనీయం. కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఇలాంటి హింసకు పాల్పడుతుందని, కేంద్ర ప్రభుత్వం పరువు పోకుండా దాడులకు పాల్పడుతుందని అన్నారు.
ఈ ఘటనపై అఖిలపక్షాలు, రాజకీయ నాయకులు, మేధావులు స్పందించాలని పిలుపునిచ్చారు.











