మంచిర్యాల జిల్లా భీమారం మండల కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన పొడేటి రవికి పలువురు నాయకులు సన్మానం చేశారు.
పొలంపల్లి మాజీ సర్పంచ్ దర్శనాల రమేష్, తెలంగాణ రాష్ట్ర గొర్రెల, మేకల పెంపకం వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు డా. కొమ్ము అశోక్ యాదవ్ లు కలిసి పొడేటి రవిని శాలువాతో సత్కరించారు.
ఈ సందర్భంగా దర్శనాల రమేష్ మాట్లాడుతూ, పొడేటి రవి నిబద్ధత కలిగిన నాయకుడని, ఆయన భీమారం మండలంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తారని, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని అన్నారు.
ఈ కార్యక్రమంలో దుర్గం శివ, కేశవేణి సత్యనారాయణ యాదవ్ కూడా పాల్గొన్నారు.
నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన పొడేటి రవికి పార్టీ కార్యకర్తలు అభినందనలు తెలిపారు.








