భైంసా పట్టణంలోని ఎస్.ఎస్. ఫ్యాక్టరీలో ఆదివారం ఉదయం 11:30 గంటలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నారు. ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది.
తానూర్ మండలానికి చెందిన CMRF లబ్ధిదారులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరుకావాలని నిర్వాహకులు కోరారు. అలాగే మండల సీనియర్ నాయకులు, బూత్ అధ్యక్షులు, కార్యకర్తలు నిర్ణీత సమయానికి హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తానూర్ మండల బీజేపీ అధ్యక్షుడు పుండ్ర లక్ష్మణ్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.












