Nirmal/Mamda (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 20
కడెం మండలంలోని బెల్లాల్ గ్రామపంచాయతీ కార్యాలయంలో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియపై సోమవారం గ్రామసభ జరిగింది. ఈ సభకు ఉప తహసీల్దార్ శ్రీమతి బొంతల లక్ష్మి భూమన్న యాదవ్ హాజరై, మరణించిన, ఇతర ప్రాంతాలకు వెళ్లిన, నివాసం మార్చుకున్న ఓటర్ల వివరాలపై సమీక్షించి, నిర్ధారణ ప్రక్రియపై చర్చించారు.
కడెం మండలంలోని బెల్లాల్ గ్రామపంచాయతీ కార్యాలయంలో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ పూర్తి ప్రక్రియకు సంబంధించి సోమవారం గ్రామసభను నిర్వహించారు.
ఈ గ్రామసభకు ఉప తహసీల్దార్ శ్రీమతి బొంతల లక్ష్మి భూమన్న యాదవ్ హాజరై ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మరణించిన ఓటర్ల వివరాలు, ఇతర ప్రాంతాలకు వెళ్లిన ఓటర్ల వివరాలు, నివాసం మార్చుకున్న ఓటర్ల వివరాలను పరిశీలించి వాటి నిర్ధారణ ప్రక్రియపై చర్చించారు.
అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని, నమోదు ప్రక్రియను పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా పూర్తి చేయాలని ఉప తహసీల్దార్ సూచించారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ సహాయకుడు లచ్చిరాం, పంచాయతీ కార్యదర్శి వి. గిరిధర్, గ్రామ పంచాయతీ అధికారి విజయ్, బూత్ స్థాయి అధికారులు శ్రీమతి రమ, శ్రీమతి సునీత, ఆశా కార్యకర్తలు, వార్డు సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.






