బాసర, జూలై 19
నిర్మల్ జిల్లా బాసరలో నూతన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడిగా నియమితులైన దయాల లక్ష్మణ్ రావును గ్రామస్తులు, యువకులు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పూలమాలలు వేసి, శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు.

ఈ సందర్భంగా గ్రామాభివృద్ధికి, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని గ్రామస్తులు ఆకాంక్షించారు. దయాల లక్ష్మణ్ రావు తనపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలుపుతూ, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజల సహకారంతో మండల అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు.