సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించండి..!!

సర్పంచుల పెండింగ్ బిల్లుల నిరసన
  • సర్పంచుల పెండింగ్ బిల్లుల చెల్లింపు డిమాండ్
  • హైదరాబాద్ పంచాయతీ రాజ్ కమిషనర్ ఆఫీస్ ఎదుట నిరసన
  • 9 నెలలుగా బిల్లుల చెల్లింపులో జాప్యం

సర్పంచుల పెండింగ్ బిల్లుల నిరసన

తెలంగాణ సర్పంచుల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వీ యాదయ్య గౌడ్ డిమాండ్చేశారు. శుక్రవారం పంచాయతీ రాజ్ కమిషనర్ ఆఫీస్ ఎదుట సర్పంచులు నిరసన తెలియజేశారు. 9 నెలలుగా బిల్లులు చెల్లించకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.

 

తెలంగాణ సర్పంచుల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని తెలంగాణ సర్పంచుల సంఘం జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వీ యాదయ్య గౌడ్ డిమాండ్చేశారు. శుక్రవారం హైదరాబాద్ బషీర్ బాగ్‌లోని పంచాయతీ రాజ్ కమిషనర్ ఆఫీస్ ఎదుట సర్పంచులు నిరసన చేపట్టారు. సర్పంచులు గేటు ముందు బైఠాయించి, తమ ఆందోళనను తెలియజేశారు. ఈ సందర్భంగా సుర్వీ యాదయ్య మాట్లాడుతూ, ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టామని, ఇప్పటి వరకు వాటి బిల్లులు చెల్లించకపోవడంతో గ్రామీణ అభివృద్ధి కుంటుపడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. 9 నెలలుగా బిల్లులు చెల్లించకపోవడం దారుణమని, ప్రభుత్వం వెంటనే స్పందించి బిల్లులు విడుదల చేయాలని డిమాండ్చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment