Pahalgam Terror Attack : పహల్గాం దాడిపై ప్రధాని మోడీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం- కీలక నిర్ణయం తీసుకునే అవకాశం
జమ్మూ-కశ్మీర్‌లోని పహల్గాంలో గత మంగళవారం (22 ఏప్రిల్, 2025) జరిగిన ఉగ్రవాద దాడిపై మోడీ ప్రభుత్వం నిరంతరం చర్యలు తీసుకుంటోంది. తాజా పరిణామాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన భద్రతా కేబినెట్ కమిటీ (CCS) సమావేశం ప్రారంభమైంది. ఇందులో పాకిస్థాన్‌పై ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ఈ సమావేశంలో హోంమంత్రిఅమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉన్నారు. అమిత్ షా PM మోడీకి పహల్గాం ఉగ్రవాద సంఘటన గురించి సమాచారం అందించారు. గత రాత్రి PM మోడీ ఆదేశాల మేరకు హోంమంత్రి జమ్మూ-కశ్మీర్‌కు బయలుదేరి వెళ్లి, ఈరోజు బుధవారం (23 ఏప్రిల్, 2025) మధ్యాహ్నం పహల్గాంలో సంఘటనా స్థలాన్ని సందర్శించి ఢిల్లీకి …
[10:26 pm, 23/4/2025] +91 99894 58400: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాక్ పై భారత్ సంచలన నిర్ణయం
ఆ దేశంతో దౌత్య సంబంధాలను పూర్తిగా తెంచుకుంటున్నట్లు ప్రకటించిన భారత్
పాక్ పౌరులు, పర్యాటకులు 48 గంటల్లో తమ దేశానికి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ
అటారీ చెక్ పోస్టును వెంటనే నిలిపివేస్తున్నట్లు స్పష్టం
పాక్ హై కమిషనర్‌ను సైతం ఇండియా విడిచి వెళ్ళిపోవాలని ఆదేశాలు జారీ
ప్రత్యేక వీసాలను కూడా నిలిపివేస్తున్నట్లు స్పష్టం
పాక్ పౌరులను భారత్లోకి అనుమతించేది లేదని తేల్చి చెప్పి.. సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటన