ఘనంగా హిందీ భాషా దినోత్సవం నిర్వహణ

హిందీ భాషా దినోత్సవం పాఠశాల కార్యక్రమం
  • వానల్పహాడ్ గ్రామ ప్రభుత్వ పాఠశాలలో హిందీ భాషా దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు.
  • హిందీ భాషా ప్రాముఖ్యతను చర్చించిన ప్రధానోపాధ్యాయులు పి. గంగాధర్.
  • విద్యార్థులకు బహుమతులు అందజేసిన ఉపాధ్యాయులు.

హిందీ భాషా దినోత్సవం పాఠశాల కార్యక్రమం

నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని వానల్పహాడ్ గ్రామ ప్రభుత్వ పాఠశాలలో హిందీ భాషా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ప్రధానోపాధ్యాయులు పి. గంగాధర్ మాట్లాడుతూ, హిందీ భాష ప్రాముఖ్యతను వివరించారు. విద్యార్థులకు బహుమతులు అందజేసిన ఉపాధ్యాయులు ధర్మాజీ చందనే, హిందీ ఉపాధ్యాయ కే. రమేష్, పంచాయతీ కార్యదర్శి గాయత్రిని సన్మానించారు.

 

సెప్టెంబర్ 21న

నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని వానల్పహాడ్ గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో హిందీ భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రధానోపాధ్యాయులు పి. గంగాధర్ హాజరై మాట్లాడారు. హిందీ భాష అనేది భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిందని, ప్రతి ఒక్కరు హిందీ భాష నేర్చుకోవాలని సూచించారు. ప్రపంచ దేశాలలో కూడా హిందీ భాషకు ప్రాధాన్యత పెరుగుతున్నదని, భవిష్యత్తులో ఈ భాష కీలకమవుతుందని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు ధర్మాజీ చందనే, హిందీ ఉపాధ్యాయులు కే. రమేష్ పాల్గొని, విద్యార్థులకు వివిధ పోటీలలో గెలిచిన వారికి బహుమతులను అందజేశారు. అలాగే ఉత్తమ పంచాయతీ కార్యదర్శిగా ఎంపికైన గాయత్రిని పాఠశాల సిబ్బంది ఘనంగా సన్మానించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment