బాల కార్మికులతో పనులు చేయిస్తే కఠిన చర్యలు తప్పవు: ఆపరేషన్ స్మైల్ ఇంచార్జ్ సాదిక్ హుస్సేన్

Operation_Smile_Child_Labour_Campaign_Sarangapur
  • ఆపరేషన్ స్మైల్ -11లో భాగంగా సారంగాపూర్ హోటల్స్‌లో బాల కార్మికుల నిర్ధారణ
  • ఇద్దరు మైనర్ బాలలను కౌన్సిలింగ్ చేసి తల్లిదండ్రులకు అప్పగింపు
  • మైనర్లను పనిలో పెట్టుకున్న హోటల్ యజమానులపై కేసులు నమోదు

 

నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండల కేంద్రంలో ఆపరేషన్ స్మైల్ -11లో భాగంగా పోలీసులు, చైల్డ్ లేబర్ డిపార్ట్మెంట్ అధికారులు హోటల్స్‌లో పనిచేస్తున్న ఇద్దరు మైనర్ బాలలను గుర్తించి కౌన్సిలింగ్ నిర్వహించారు. హోటల్ యజమానులపై కేసులు నమోదు చేసి, బాల కార్మికులతో పనులు చేయిస్తే కఠిన చర్యలు ఉంటాయని ఆపరేషన్ స్మైల్ ఇంచార్జ్ సాదిక్ హుస్సేన్ హెచ్చరించారు.

 

సారంగాపూర్ మండల కేంద్రంలో శుక్రవారం ఆపరేషన్ స్మైల్ -11 కార్యక్రమం నిర్వహించారు. చైల్డ్ లేబర్ డిపార్ట్మెంట్ అధికారి ఎం. మహేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సారంగాపూర్ పోలీసు అధికారులు హోటల్స్‌లో పనిచేస్తున్న ఇద్దరు మైనర్ బాలులను గుర్తించారు.

బాలురు ఉన్న హోటల్స్‌లో సోదాలు నిర్వహించి, వారికి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. అనంతరం ఆపరేషన్ స్మైల్ ఇంచార్జ్ ఎస్సై సాదిక్ హుస్సేన్ సమక్షంలో బాలలను వారి తల్లిదండ్రులకు అప్పగించారు. మైనర్లను పనిలో పెట్టుకున్న హోటల్ యజమానులు భూమా గౌడ్, బురరామ్‌పై చట్టపరమైన చర్యలు తీసుకున్నారు.

సమావేశంలో మాట్లాడిన ఎస్సై సాదిక్ హుస్సేన్, “బాల కార్మికులతో పనులు చేయిస్తే కఠిన చర్యలు తప్పవు. ప్రతి యజమాని ఈ విషయంలో బాధ్యతతో ఉండాలి” అని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాలల పరిరక్షణ అధికారులు నరేందర్, సగ్గం రాజు, హెడ్ కానిస్టేబుల్ అబ్దుల్ జమీర్, కానిస్టేబుల్స్ నరేష్, ముత్యం పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment

Exit mobile version