డ్యంగాపూర్ వద్ద కారు ప్రమాదం: ఒకరికి గాయాలు

డ్యంగాపూర్ కారు ప్రమాదం ఘటన స్థలం
  • డ్యంగాపూర్ గ్రామ శివారులో కారు ప్రమాదం
  • కోతుల గుంపు కారణంగా కారు చెట్టుకు ఢీకొని బోల్తా
  • మల్లెపూల నర్సయ్య మనవడు గౌతమ్‌కు గాయాలు

నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం డ్యంగాపూర్ గ్రామ శివారులో కారు ప్రమాదం జరిగింది. కోతుల గుంపు కారణంగా కారు అదుపుతప్పి చెట్టుకు ఢీకొని బోల్తా పడింది. ఈ ఘటనలో మల్లెపూల నర్సయ్య మనవడు గౌతమ్ (13) ఎడమ భుజంపై గాయపడ్డాడు. గౌతమ్‌ను వెంటనే నిర్మల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

M4News, సారంగాపూర్, జనవరి 15:

నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం డ్యంగాపూర్ గ్రామ శివారులో బుధవారం ప్రమాదం చోటుచేసుకుంది. నేరడిగొండ మండలం వడూర్ గ్రామానికి చెందిన మల్లెపూల నర్సయ్య తన కారు (TS 01 EA/1648)లో నిర్మల్ వైపు ప్రయాణిస్తున్నాడు. ఈ సమయంలో డ్యంగాపూర్ గ్రామ శివారులో అకస్మాత్తుగా కోతుల గుంపు రోడ్డుపైకి రావడంతో కారును వేగంగా కుడివైపు తిప్పారు.

దీంతో కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టుకు ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నర్సయ్య మనవడు గౌతమ్ (13) ఎడమ భుజంపై గాయపడ్డాడు. గాయపడిన గౌతమ్‌ను వెంటనే నిర్మల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment