ఒకే దేశం, ఒకే ఎన్నికలు: జమిలి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యిందా?

జమిలి ఎన్నికల ప్రతిపాదన
  • జమిలి ఎన్నికల ప్రతిపాదనపై మరోసారి చర్చ
  • రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీ నివేదికను రాష్ట్రపతికి సమర్పణ
  • 32 రాజకీయ పార్టీలు మద్దతు, 80% ప్రజలు అనుకూలంగా

ఒకే దేశం, ఒకే ఎన్నికల ప్రతిపాదన మరోసారి చర్చకు వచ్చింది. రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ 18,626 పేజీల నివేదికను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించింది. 47 పార్టీలు అభిప్రాయాలు తెలిపాయి, 32 మద్దతు ప్రకటించాయి. దేశంలో ఎన్నికల ఖర్చు తగ్గించడమే ప్రధాన లక్ష్యం. ప్రారంభంగా లోక్‌సభ, శాసనసభ ఎన్నికలు, ఆపై 100 రోజుల్లో స్థానిక ఎన్నికలు జరపాలని కమిటీ సిఫార్సు చేసింది.

 

జమిలి ఎన్నికల ప్రతిపాదన పై కేంద్ర ప్రభుత్వం మరోసారి ముందడుగు వేసింది. భారతదేశం మొత్తం ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం ద్వారా ప్రజాధనం ఆదా చేయాలని, పరిపాలనా సమర్థతను పెంచాలని భావిస్తూ, రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ తన నివేదికను 18,626 పేజీలతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించింది. ఈ ప్రతిపాదనపై 47 రాజకీయ పార్టీలు అభిప్రాయాలు తెలిపాయి, అందులో 32 పార్టీలు ఈ పథకానికి మద్దతు తెలిపాయి. ప్రజల నుంచి సుమారు 21 వేల 558 ప్రతిస్పందనలు రావగా, 80% ప్రజలు జమిలి ఎన్నికలను సమర్థించారు.

కమిటీ నివేదికలో, ప్రతి సంవత్సరం ఒకరి తరువాత ఒకరికి ఎన్నికలు జరుగుతుండడంతో దేశం యొక్క పురోగతికి తీవ్రమైన ప్రభావం పడుతోందని, ఖర్చులు ఎక్కువవుతున్నాయని వివరించారు. తొలుత లోక్‌సభ, శాసనసభ ఎన్నికలను ఒకేసారి నిర్వహించి, 100 రోజుల్లో స్థానిక బాడీ ఎన్నికలు జరపాలని సిఫార్సు చేశారు. ఈ ప్రక్రియను అమలు చేయడానికి రాజ్యాంగంలోని ఐదు ఆర్టికల్స్ సవరించాలని సూచించారు.

ఈ ప్రతిపాదనకు వ్యాపార రంగం నుంచి కూడా మద్దతు ఉంది. CII, FICCI, ASSOCHAM వంటి అగ్రశ్రేణి సంస్థలతోపాటు న్యాయవేత్తలు, ఆర్థిక నిపుణుల అభిప్రాయాలను కూడా కమిటీ సేకరించింది. మూడోసారి అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం ఈ ప్రతిపాదనను ముందుకు తీసుకువెళ్లడానికి కృషి చేస్తోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment

Exit mobile version